తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయం సిద్ధం చేసింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన సచివాలయ భవన నిర్మాణానికి రూ.619 కోట్లు నిర్మాణవ్యయంగా ప్రతిపాదన పెట్టింది. ఈ నిర్మాణ వ్యయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలుత రూ.400 కోట్ల వ్యం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం నమూనా ఆరు అంతస్తుల నుంచి ఏడు అంతస్తులకు పెంచడం వల్ల నిర్మాణ వ్యయం పెంచారు. మొత్తం ఏడు లక్షల చదరపు అడుగుల్లో ఏడు అంతస్తుల్లో నూతన సచివాలయ నిర్మాణం జరగనుంది. టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా అధికారులు అంచనాలు రూపొందించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.
సచివాలయం నిర్మాణ ఖర్చు రూ.619 కోట్లు.. మంత్రివర్గం ఆమోదం! - సచివాలయ నిర్మాణ వ్యయానికి మంత్రివర్గం ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ మేరకు సచివాలయ నిర్మాణానికి రూ.619 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంచనా వ్యయానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
సచివాలయం నిర్మాణ ఖర్చు రూ.619 కోట్లు.. మంత్రివర్గం ఆమోదం!