శాసనసభలో పద్దులపై చర్చ ఈ రోజు కూడా కొనసాగనుంది. మంగళవారం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పునరావాస, వాణిజ్య పన్నులు, బలహీనవర్గాల గృహ నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమం, పౌర సరఫరాల, ఎక్సైజ్, రవాణా, హోం, వ్యవసాయం, సహకార, పశు సంవర్ధక, మత్స్య శాఖల పద్దులపై అసెంబ్లీ చర్చించి ఆమోదించింది.
బడ్జెట్ పద్దులపై నేడూ శాసనసభలో కొనసాగనున్న చర్చ - telangana varthalu
శాసనసభలో నేడు కూడా పద్దులపై చర్చ జరగనుంది. ఇవాళ విద్యాశాఖ, వైద్యారోగ్యం సహా వివిధ శాఖల పద్దులపై చర్చ చేపట్టనున్నారు.

బడ్జెట్ పద్దులపై నేడూ శాసనసభలో కొనసాగనున్న చర్చ
ఇవాళ పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య, వైద్యారోగ్యం, క్రీడలు, కార్మిక, దేవాదాయ, అటవీ, పర్యాటక, ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, పరిశ్రమల శాఖల పద్దులపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ యాంత్రీకరణ, బస్తీ దవాఖానాలు, గిరిజన ఉప ప్రణాళిక, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు నిర్మాణం, పామాయిల్ సాగు అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
ఇదీ చదవండి: 'త్వరలోనే.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు'