Budget Sessions 2022: సోమవారం నుంచి ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాల కోసం ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సమావేశాల నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉన్నతాధికారులతో పాటు పోలీసు అధికారుల సమావేశం జరగనుంది. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రొటెం ఛైర్మన్ జాఫ్రి అధికారులతో సమావేశం కానున్నారు.
Budget Sessions 2022: ఇవాళ బడ్జెట్ సన్నాహక సమావేశాలు - Budget sessions 2022
Budget Sessions 2022: సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేశారు. ఇవాళ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.
Sessions
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, సంబంధిత అధికారులతో సమావేశమై సన్నద్దతను సమీక్షిస్తారు. ప్రశ్నలు, శూన్యగంట అంశాలు, తదితరాలకు సమాధానాల స్థితిని సమీక్షించి ఆదేశాలు జారీ చేస్తారు. పోలీసు అధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తారు.
ఇదీ చూడండి: