Telangana Assembly Budget Session: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఉభయసభలు ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసం శాసనసభ, మండలి సమావేశాలను త్వరలో నిర్వహించనున్నారు. గత ఏడాది.. మార్చి 15న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై పది రోజుల పాటు జరిగాయి. అప్పుడు మార్చి 18న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది అంతకు ముందుగానే సమావేశాలను పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన రాష్ట్ర ప్రభుత్వం... మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తంగా ఖరారు చేసింది. ముహూర్తానికి ముందుగానే మార్చి 21న నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించనున్నారు. వైభవంగా నిర్వహించనున్న ఈ వేడుకల సమయానికి వీలైనంత ముందుగానే బడ్జెట్ సమావేశాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మార్చి రెండో వారానికే సమావేశాలను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రోరోగ్ చేసిన తర్వాతే..