Telangana Budget 2022: 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇవాళ వెల్లడి కానుంది. తుది కసరత్తు అనంతరం నిన్న సాయంత్రం... బడ్జెట్‌ను మంత్రివర్గం ముందుంచారు. రాబడులు, కేటాయింపులు, ప్రాధాన్యతలను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్‌కు వివరించారు. ఆ తర్వాత బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. దాన్ని ఇవాళ ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. గత రెండేళ్లు బడ్జెట్ పరిమాణాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం క్రితం ఏడాది అంచనాలపై 20 శాతానికి పైగానే పెంచుతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడి బాగా ఉంది. అంచనాలను అందుకుంటామన్న విశ్వాసంతో సర్కార్ ఉంది.
అంచనాల కంటే 20 శాతానికి పైగానే...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి 20 శాతానికి పైగానే పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అటు జీఎస్డీఏ వృద్ధిరేటు కూడా 19 శాతానికి పైగా ఉంది. భూముల అమ్మకం తదితరాల ద్వారా పన్నేతర ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీఎస్డీపీ పెరుగుదలతో బాండ్ల ద్వారా తీసుకునే రుణాల మొత్తం కూడా పెరగనుంది. వీటన్నింటి నేపథ్యంలో రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దును భారీగానే సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది బడ్జెట్ అంచనాల కంటే 20 శాతానికి పైగానే పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. దీంతో బడ్జెట్ పద్దు 2.70 లక్షల కోట్ల రూపాయలను దాటే అవకాశం కనిపిస్తోంది. 25 శాతం పెరుగుదలకు కూడా అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ప్రగతి పద్దు 1.50 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. నిర్వహణ పద్దు 1.20 లక్షల కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది.
భారీగా పద్దు...