బడ్జెట్: సంక్షేమం, నీటి పారుదలకు పెద్దపీట అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం అంచనా రూ.1,46,492.3 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు కాగా... మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08 కోట్లుగా ఉండగా... ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లుగా ఉంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.19,718.57 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.69,328.57 కోట్లని పేర్కొన్నారు. అమ్మకపు పన్ను ద్వారా రూ.47,789 కోట్లు, ఎక్సైజ్ ద్వారా రూ.10,901 కోట్లు, ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ.10,901 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,146 కోట్లు వస్తాయని అంచనావేశారు. వాహనాల పన్నుల ద్వారా రూ.3,714 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.15,875 కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రూ.8,177.75 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు వస్తాయని వివరించింది.
కేటాయింపులు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రైతుబంధుకు రూ.12వేల కోట్లు, రైతు రుణమాఫీకి రూ. 6వేల కోట్లు, రైతుబీమా పథకాలకు రూ. 1,137 కోట్ల నిధులను కేటాయించారు. విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8వేల కోట్లు.. ఆసరా పింఛన్ల కోసం రూ.9,402 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు. గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు, పురపాలక సంఘాలకు రూ.1,764 కోట్లు, బియ్యం రాయితీ కోసం రూ.2,287 కోట్లను కేటాయించారు. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.10 వేల కోట్లు.. ఉపకార వేతనాలకు రూ.3,257 కోట్లను ప్రకటించారు. ప్రజారోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌లకు రూ.1,336 కోట్లు కేటాయించగా... కల్యాణలక్ష్మి పథకం కోసం రూ.1,540 కోట్లు ఖర్చు చేయనున్నారు. సంక్షేమరంగానికిరూ.75,263 కోట్లు, సంస్థాగత వ్యయం కోసం రూ.71,229 కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో కేంద్రపథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులు రూ.31,802 కోట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్లిన నిధులు రూ.2,72,926 కోట్లని వెల్లడించారు.
బడ్జెట్ హైలైట్స్
రాష్ట్ర బడ్జెట్ మొత్తం అంచనా | రూ.1,46,492.3 కోట్లు |
మొత్తం రెవెన్యూ ఆదాయం | రూ.1,13,099.92 కోట్లు |
రెవెన్యూ వ్యయం | రూ.1,11,055 కోట్లు |
మూలధన వ్యయం | రూ.17,274.67 కోట్లు |
బడ్జెట్ అంచనాల్లో మిగులు | రూ.2,044.08 కోట్లు |
ఆర్థిక లోటు | రూ.24,081.74 కోట్లు |
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా | రూ.19,718.57 కోట్లు |
రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం | రూ.69,328.57 |
అమ్మకపు పన్ను | రూ.47,789 కోట్లు |
ఎక్సైజ్ ద్వారా ఆదాయం | రూ.10,901 కోట్లు |
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం | రూ.6,146 కోట్లు |
వాహనాల పన్నుల ద్వారా ఆదాయం | రూ.3,714 కోట్లు |
పన్నేతర ఆదాయం | రూ.15,875 కోట్లు |
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు | రూ.8,177.75 కోట్లు |
రుణాలు, అడ్వాన్సుల ఖర్చు | రూ.8,896.02 కోట్లు |
మూలధన పంపిణీ | రూ.9,265.77 కోట్లు |
బడ్టెట్లో కేటాయింపులు
సంక్షేమరంగం | రూ.75,263 కోట్లు |
సంస్థాగత వ్యయం | రూ.71,229 కోట్లు |
రైతుబంధు | రూ.12 వేల కోట్లు |
రైతు రుణమాఫీ | రూ.6 వేల కోట్లు |
రైతుబీమా | రూ.1,137 కోట్లు |
విద్యుత్ రాయితీలు | రూ.8 వేల కోట్లు |
ఆసరా పింఛన్లు | రూ.9,402 కోట్లు |
బియ్యం రాయితీ | రూ.2,287 కోట్లు |
ప్రత్యేక అభివృద్ధి నిధి | రూ.10 వేల కోట్లు |
ఉపకార వేతనాలు | రూ.3,257 కోట్లు |
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ | రూ.1,336 కోట్లు |
కల్యాణలక్ష్మి | రూ.1,540 కోట్లు |
ఇదీ చూడండి: తెలంగాణ బడ్జెట్... రూ.1,46,492.3 కోట్లు