తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా పద్దు: జీవన్​ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కేటాయించిన నిధులు బకాయిలకు సైతం సరిపోవని విమర్శించారు.

Jeevan Reddy
Jeevan Reddy

By

Published : Mar 8, 2020, 5:38 PM IST

తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జీవన్ రెడ్డి... రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులందరిని బడ్జెట్ నిరాశపరిచిందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ విధానాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కేటాయించిన నిధులు బకాయిలకు కూడా సరిపోవని విమర్శించారు.

ఉద్యోగుల పీఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన ఆరేళ్లుగా సూపర్ స్పెషాలిటీ వ్యవస్థ లేదని దుయ్యబట్టారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలున్నాయని ఆక్షేపించారు. బడ్జెట్‌పై సమగ్ర చర్చ జరగాలని... మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని జీవన్​రెడ్డి అభిప్రాయపడ్డారు.

'విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా పద్దు'

ఇదీ చూడండి :తెలంగాణ బడ్జెట్‌.. రూ.1,82,914 కోట్లు

ABOUT THE AUTHOR

...view details