Telangana Budget 2024-25 : బడ్జెట్ కసరత్తులో భాగంగా శాఖల వారీ సమీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24వ తేదీ నుంచి 27 వరకు జరగనున్నాయి. ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలకు అనుగుణంగా కొత్త పథకాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు, ఆర్థిక భారానికి సంబంధించి విడిగా నివేదిక సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ఆయా శాఖలకు సూచించింది.
Telangana Budget Review Meeting: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇప్పటికే ప్రారంభమైంది. 2024-25 బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. బడ్జెట్ కసరత్తులో భాగంగా అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రులు, అధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రోజుకు ఇద్దరు చొప్పున మంత్రులకు సంబంధించిన శాఖలతో డిప్యూటీ సీఎం సమావేశం జరగనుంది.
ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?
Deputy CM Bhatti Meeting With Ministers: 18వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన శాఖల సమావేశాలు ఉంటాయి. 19న సీతక్క, దామోదర రాజనర్సింహకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది. 20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు నిర్వహిస్తున్న శాఖల ప్రతిపాదనలపై ఉపముఖ్యమంత్రి సమీక్షిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ కు చెందిన శాఖల సమావేశాలు 22వ తేదీన జరుగుతాయి. 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27 తేదీల్లో జరుగుతాయి. మూడు రోజుల్లో రోజుకు నాలుగు చొప్పున శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తారు.