తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ బడ్జెట్... రూ.1,46,492.3 కోట్లు

2019-20 ఆర్థిక  సంవత్సరానికి రూ.1,46,492.3 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్​ను ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.

తెలంగాణ బడ్జెట్ తాజా వార్తలు

By

Published : Sep 9, 2019, 12:07 PM IST

Updated : Sep 9, 2019, 4:50 PM IST

రాష్ట్ర బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు

గత ఫిబ్రవరిలో ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం...ఇవాళ అసెంబ్లీలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టింది. రూ.1,46,492.3 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్​ను ముఖ్యమంత్రి కేసీఆర్​ శాసనసభలో ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు, బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08 కోట్లు, ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు. ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గినా... పరిస్థితుల్లో మార్పు వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు కేసీఆర్​ తెలిపారు.

ఐదేళ్లలో కేంద్రపథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులు రూ.31,802 కోట్లు కాగా... రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్లిన నిధులు రూ.2,72,926 కోట్లు.

బడ్జెట్ కేటాయింపులు...

రైతుబంధు రూ.12 వేల కోట్లు
రైతు రుణమాఫీ రూ.6 వేల కోట్లు
రైతుబీమా రూ.1,137 కోట్లు
విద్యుత్ రాయితీ రూ.8 వేల కోట్లు
ఆసరా పింఛన్లు రూ.9,402 కోట్లు
గ్రామపంచాయతీ రూ.2,714 కోట్లు
పురపాలక సంఘాలు రూ.1,764 కోట్లు

ఇవీ చూడండి: పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశం

Last Updated : Sep 9, 2019, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details