తెలంగాణలోని లక్షలాది మంది భాజపా కార్యకర్తలు కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రతి భాజపా కార్యకర్త కరోనా వ్యతిరేక సేవకుడిగా సేవలందించాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్
కరోనా విపత్తును ఎదుర్కొనే విషయంలో రాష్ట్ర సర్కారుకు తమ పూర్తి సహకారం ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్‌కు సంజయ్ లేఖ రాశారు.
Bandi sanjay write a letter to cm kcr about carona issue
నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా దళారులపై చర్యలు తీసుకోవాలని సీఎంకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. కరోనాను కేంద్రం ఆయుష్మాన్ భారత్‌లో చేర్చిన దృష్ట్యా తెలంగాణలో కూడా ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని కోరారు.