లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్ -చైనా మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ సంతాపం తెలియజేశారు. జవాన్లు అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్శించి దేశ సేవకోసం ప్రాణాలు త్యాగం చేశారని పేర్కొన్నారు.
మీ త్యాగాలు నిరుపమానం: బండి సంజయ్ - కల్నల్ బిక్కుమళ్ల సంతోశ్ బాబు
చైనా సైన్యం దాడిలో వీర మరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం తెలియజేశారు. వీరమరణం పొందిన జవాన్ల ఆత్మలకు శాంతిని చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
![మీ త్యాగాలు నిరుపమానం: బండి సంజయ్ Telangana BJP President Bandi Sanjay Tribute Army Officers in China Attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7646719-883-7646719-1592338728100.jpg)
మీ త్యాగాలు నిరుపమానం: బండి సంజయ్
వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎన్నటికీ మరువమన్నారు. సూర్యాపేటకు చెందిన వీర సైనికుడు కల్నల్ సంతోష్ బాబుతోపాటు మరో అమరులైన వీరజవాన్లకు నివాళులర్పించారు. సైనికుల సేవలను దేశం ఎప్పటికీ స్మరించుకుంటుందని తెలిపారు.