Bandi Sanjay Letter To CM KCR : రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల వేధింపులు నిత్యకృత్యంగా మారాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. వారిలో మనోధైర్యం నింపి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసును క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ రాశారు.
Bandi Sanjay Letter To CM KCR : సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ.. ఎందుకంటే.. - ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay Letter To CM KCR : పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు వారి సర్వీసును క్రమబద్దీకరించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Bandi Sanjay Letter
గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ, దోమల నివారణ సహా పలు కార్యక్రమాలు వీరి చేతులమీదుగానే జరుగుతాయి. ఈ సమయంలో వారికి కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతో పాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :కేసీఆర్ ప్రధాని కావాలని మొక్కుకున్నా: మంత్రి మల్లారెడ్డి