ప్రభుత్వ లెక్కల వల్లే కరోనాపై ప్రజల నిర్లక్ష్యం నెలకొందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రరూపం దాల్చుతుంటే కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఒక్కసారైనా సమీక్ష చేయకపోవడం దారుణమని ఆక్షేపించారు. ఆక్సిజన్, రెమ్డెసివర్ ఇంజక్షన్ కొరత ఏర్పడితే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కొందరు కావాలనే రెమ్డెసివర్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. పలుచోట్ల ఎమ్మార్పీ ధరకంటే అధికంగా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఉందని... కష్టకాలంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బందికి జీతాలు, మాస్కులు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు.
కేంద్రం చర్యలు