తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP phone tapping allegations on TRS: తెరాసపై సీఈసీకి తరుణ్ చుగ్ ఫిర్యాదు - తెరాసపై భాజపా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

BJP phone tapping allegations on TRS: మునుగోడు ఉపఎన్నిక ప్రచార గడువు కాసేపట్లో ముగియనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి తెరాసపై భాజపా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు భాజపా నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

BJP phone tapping allegations on TRS
BJP phone tapping allegations on TRS

By

Published : Nov 1, 2022, 12:51 PM IST

BJP phone tapping allegations on TRS: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగియనున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తెరాసపై భాజపా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తెరాస నేతలు.. భాజపా నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మునుగోడులో ఓటమి తప్పదని అర్థమైన తెరాస తమ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డిపై అక్రమ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తెరాస నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

BJP Complaint against TRS : మరోవైపు ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ ఈసీని కలిశారు. మునుగోడు ఉపఎన్నికలో భాజపాను, పార్టీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డిని బదనాం చేసే ఉద్దేశంతో తెరాస నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించినట్లు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్​ను కలిసిన భాజపా బృందం.. తెరాస రాజగోపాల్​రెడ్డిపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న ఖాతాలకు సుశీ ఇన్​ఫ్రా నుంచి ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details