తెలంగాణ

telangana

ETV Bharat / state

"కష్టపడి పనిచేయండి.. తెలంగాణలో గెలుపు మనదే" - telangana bjp mps

కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తప్పకుండా గెలుస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర భాజపా ఎంపీలతో మోదీ 15 నిమిషాలు మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

telangana bjp mps met prime minister narendra modi in delhi
మోదీని కలిసిన తెలంగాణ భాజపా ఎంపీలు

By

Published : Dec 13, 2019, 2:18 PM IST

దేశంలో కుటుంబ పార్టీలు కనుమరుగవుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాల ఉదాహరణలను తెలంగాణ ఎంపీలకు వివరించారు. తెలంగాణలోనూ ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. కష్టపడి పనిచేయాలని, అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు.

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఆరా...

యువ పశువైద్యురాలు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మోదీ ఆరా తీశారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రజాస్పందన ఎలా ఉందని ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు తెరాస మద్దతు ఇవ్వలేదని ప్రధానికి ఎంపీ సంజయ్ గుర్తు చేశారు. తెరాస వాళ్లు అలాగే ఉంటారని మోదీ వ్యాఖ్యానించారు.

సమ్మక్క- సారలమ్మ విశిష్టత ఏంటి?

సమ్మక్క- సారలమ్మ విశిష్టత ఏమిటని మోదీ అడిగి తెలుసుకున్నారు. గరికపాటి మోహన్‌రావు అక్కడి నుంచే వచ్చారని కిషన్‌రెడ్డి చెప్పారు. వెంటనే స్పందించిన గరికపాటి.. సమ్మక్క, సారలమ్మ గద్దె విశిష్టతను వివరించారు.

ఇదీ చూడండి: నిర్భయ: న్యాయం కోసం ఈ నెల 18 వరకు ఆగాల్సిందేనా?

ABOUT THE AUTHOR

...view details