BJP MLAs On Speaker: శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులను అడ్డుపెట్టుకుని బాధ్యతలు మరిచిపోయి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, విలువలను అగౌరవపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. సంప్రదాయబద్ధంగా నడుచుకోవాలనే కోర్టులు సూచిస్తాయని.. కానీ న్యాయస్థానం సూచనలను తుంగలో తొక్కే దుష్ట సంప్రదాయం తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో సభ్యుల అభిప్రాయాలను తీసుకోవాలని స్పీకర్‌ను కోరినా.. తిరస్కరించారని ఈటల వెల్లడించారు. ఈ పరిస్థితి ప్రజలకు ఏం మెసేజ్ పంపుతుందని ప్రశ్నించారు.
ఈనెల 17 దీక్ష చేస్తాం..
తెలంగాణ వస్తే అన్నింటా ఆదర్శంగా మారుతామని ప్రజలు భావించాలని.. కానీ ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితి ఉత్తర కొరియాలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేస్తుందని చెప్పిన ఈటల.. నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు మాట్లాడుతున్న సమయంలో చప్పట్లు కొట్టలేదనే కారణంతో కఠినంగా శిక్షించినట్లు.. ఇక్కడా అలాంటి పరిస్థితి తెస్తారా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని.. ఈటల విమర్శించారు. ఇందుకోసమేనా రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్పీకర్ నిర్ణయంపై 17న ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేస్తామని.. వెల్లడించారు. ఇందులో భాజపా నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.
సుప్రీంకు వెళ్తాం..