Telangana BJP MLA Candidates List 2023 :రాష్ట్రంలో పాగా వేసే లక్ష్యంతో కాషాయ పార్టీ బలమైన గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో సీట్లు దక్కని వాళ్లను చేర్చుకుని బరిలోకి దింపాలని భావిస్తోంది. బలమైన నేతలున్న నియోజకవర్గాల్లో 35 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాశ్ జవడేకర్‌తో అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ(Telangana Assembly Election 2023) బరిలో ఎంపీలను దింపాలని అధిష్ఠానం భావిస్తోంది.
రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Telangana BJP Chief Kishan Reddy) అంబర్ పేట.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూ రావు బోధ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్.. బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కిషన్ రెడ్డి మాత్రం అంబర్‌పేట నుంచి కాక.. మళ్లీ సికింద్రాబాద్ ఎంపీగానే బరిలో దిగేందుకు ఆసక్తి ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 17 తర్వాత బీజేపీ తొలి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
Telangana BJP MLAs List 2023 : బీజేపీ ప్రకటించే తొలి జాబితాలో అంబర్ పేట-కిషన్ రెడ్డి, ముషీరాబాద్-లక్ష్మణ్ లేదా బండారు విజయలక్ష్మి, సనత్ నగర్-మర్రి శశిధర్ రెడ్డి, ఉప్పల్- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మల్కాజిగిరి-రాంచంద్రరావు, ఖైరతాబాద్-చింతల రామచంద్రారెడ్డి, గోషామహల్-విక్రమ్ గౌడ్, మహేశ్వరం-అందెల శ్రీరాములు యాదవ్, కల్వకుర్తి-ఆచారి, గద్వాల్-డీకే అరుణ, మహబూబ్ నగర్-జితేందర్ రెడ్డి, తాండూరు-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం-బూర నర్సయ్య గౌడ్, కుత్బుల్లాపూర్-కూన శ్రీశైలం గౌడ్, భువనగిరి-గూడూరు నారాయణ రెడ్డి, ఆలేరు-కాశం వెంకటేశ్వర్లు, హుజురాబాద్-ఈటల రాజేందర్, కరీంనగర్-బండి సంజయ్‌ను పోటీలో నిలపాలని బీజేపీ భావిస్తోంది.
Telangana Assembly Election 2023 : అలాగే చొప్పదండి-బొడిగె శోభ, వరంగల్ తూర్పు-ఎర్రబెల్లి ప్రదీప్ రావు, భూపాలపల్లి-చందుపట్ల కీర్తిరెడ్డి, వేములవాడ-తుల ఉమ, బోధ్-సోయం బాపూ రావు, ఆర్మూర్-ధర్మపురి అర్వింద్, మునుగోడు-కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వర్లు, పరకాల-గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, రామగుండం-సోమారపు సత్యనారాయణ, దుబ్బాక-రఘునందన్ రావు, వర్ధన్నపేట-కొండేటి శ్రీధర్, మహబూబాబాద్-హుస్సేన్ నాయక్, సికింద్రాబాద్- బండా కార్తీక రెడ్డి, నర్సంపేట-రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి పేర్లు ఉండనున్నట్లు ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్ దక్కని బలమైన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకుని ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోంది.