తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​కు వినతిపత్రం అందించిన భాజపా నేతలు

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు, పాలకమండలి ఏర్పాటు చేయాలని కోరుతూ భాజపా నేతల బృందం గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం అందించింది. నేతలు వర్సిటీల్లోని పరిస్థితులను గవర్నర్​కు వివరించారు.

telangana-bjp-leaders-meet-governor-tamilisai-at-rajbhavan-on-university-issues
గవర్నర్​కు వినతిపత్రం అందించిన భాజపా నేతలు

By

Published : Jan 12, 2021, 12:17 PM IST

Updated : Jan 12, 2021, 2:27 PM IST

భాజపా ప్రతినిధుల బృందం గవర్నర్ తమిళిసైను కలిసింది. తెలంగాణలోని యూనివర్సిటీలకు ఉపకులపతులు, పాలకమండలి ఏర్పాటు చేయాలని నేతలు వినతిపత్రం సమర్పిచారు. భాజపా నేతలు మురళీధర్​ రావు, లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్​ రావు... వర్సిటీల్లోని పరిస్థితిని గవర్నర్​కు వివరించారు.

విద్యార్థులు నష్టపోతున్నారు..

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బలహీన వర్గాలను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్లామని పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలని కోరినట్లు లక్ష్మణ్ తెలిపారు.

గవర్నర్​కు వినతిపత్రం అందించిన భాజపా నేతలు

అన్యాయం జరుగుతోంది..

తెలంగాణ విద్యారంగానికి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మురళీధర్​ రావు వ్యాఖ్యానించారు. వర్సిటీలకు ఉపకులపతులను నియమించట్లేదని... ఆందోళన చేస్తున్నామని నిన్న 2 వర్సిటీలకు వీసీల పేర్లు ప్రకటించారని తెలిపారు. కేసీఆర్ విద్యారంగానికి చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్‌కు వివరించామని మురళీధర్‌రావు పేర్కొన్నారు. విద్యను వ్యాపారం చేసేవారికి ప్రైవేట్ వర్సిటీలు కట్టబెట్టారని ఆరోపించారు.

ఇదీ చూడండి:గ్రేటర్​లో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్​

Last Updated : Jan 12, 2021, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details