కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బీఆర్కే భవన్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
'రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి' - తెలంగాణ తాజా వార్తలు
రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నందున హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని క్రీడా మైదానాలను కొవిడ్ తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చాలని మంత్రి ఈటల రాజేందర్‌కు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడి అరికట్టి వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలన్నారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ కొరత సృష్టిస్తున్న డ్రగ్ మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని