తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీవో నంబరు 43ను సవరించాలి' - Jajula Srinivas Demanded for GO number 43 should be revised

బడుగు బలహీన వర్గాలకు వైద్య, విద్యను దూరం చేస్తున్న ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ సూచించారు. పీజీ కౌన్సెలింగ్​ను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Telangana BC Welfare Association president Jajula Srinivas Demanded for GO number 43 should be revised
జీవో నంబరు 43ను సవరించాలి

By

Published : Jun 7, 2020, 11:06 PM IST

రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల రిజర్వేషన్ హక్కులను కాలరాస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్​లో బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ పేరుతో దీక్ష నిర్వహించారు. వైద్య విద్యలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులను పొమ్మనకుండా పొగ పెడుతోందన్నారు.

పీజీ కౌన్సెలింగ్​ను నిలిపివేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా జీవో నంబర్ 43ను సవరించి బడుగులకు న్యాయం జరిగే విధంగా నూతన జీవోను తీసుకురావాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రిజర్వేషన్ల స్ఫూర్తిని కాపాడాలన్నారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details