రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా... తన శాయశక్తులా పనిచేస్తామని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని వివరించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర తొలి మానవ హక్కుల ఛైర్మన్గా నియామకమైన జస్టిస్ చంద్రయ్య, కమిషన్ మెంబర్ ఇర్ఫాన్లకు పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు కృష్ణయ్య, తెజస అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు.
'మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పనిచేస్తాం' - bc welfare association
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హెచ్చార్సీ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య, కమిషన్ సభ్యులు ఇర్ఫాన్లకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పని చేస్తామని జస్టిస్ చంద్రయ్య అన్నారు.

'మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పనిచేస్తాం'
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి... మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు జస్టిస్ చంద్రయ్య పేర్కొన్నారు. న్యాయానికి, మానవత్వానికి ప్రతిబింబం జస్టిస్ చంద్రయ్య అని ఆర్.కృష్ణయ్య అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించారని... లోకాయుక్తగా, హెచ్చార్సీ ఛైర్మన్గా అణగారిన వర్గాల వారిని నియమించడం హర్షనీయమన్నారు.
'మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా పనిచేస్తాం'
ఇవీ చూడండి: 'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'