Telangana BC Commission: తమిళనాడులో తెలంగాణ బీసీ కమిషన్ బృందం మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు చెన్నై సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌తో వారు సమావేశమయ్యారు. తమిళనాడు రాష్ట్రం చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల అమలు తీరు తెన్నులను అధ్యయనం చేయడానికి రాష్ట్రానికి వచ్చినట్లు సీఎంకు తెలిపారు.
తాము చేయబోయే అధ్యయన వివరాలను ఆయన దృష్టికి తెచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిమాణాత్మకంగా రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ.. సమాచార సేకరణలో అవలంబించాల్సిన పద్దతులను ఇక్కడి అధికారుల ద్వారా సమగ్రంగా సేకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని స్టాలిన్‌ను కమిషన్ బృందం శాలువాతో సన్మానించి పలు పుస్తకాలను అందచేశారు.