కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ దేశ వ్యాప్తంగా శానిటేషన్ సవాళ్లపై జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించింది (sanitation challenge Awards). ఈ పోటీల్లో తెలంగాణకు పలు అవార్డులు దక్కాయి (Sanitation Awards). స్వచ్ఛ సర్వేక్షణ్, గార్బెజ్ ఫ్రీ సిటీ , సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్పై పోటీలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 4,300 పట్టణాలు, నగరాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. వీటి ద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యం పట్ల చైతన్యం తీసుకరావడం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పెరగడం, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని 139 పట్టణ స్థానిక సంస్థల్లో 110 పట్టణ స్థానిక సంస్థలు ఓడీఎఫ్ (ODF), ఓడీఎఫ్ప్లస్ (ODF PLUS) , ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ (ODF PLUS PLUS) , వాటర్ ప్లస్ (WATER PLUS) నగరాలు, పట్టణాలుగా ఎంపికయ్యాయి. 101 ఓడీఎఫ్ ప్లస్, 8 ఓడీఎఫ్ ప్లస్ ప్లస్, వాటర్ ప్లస్ సిటీగా జీహెచ్ఎంసీ ఎంపికైంది.
సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో జాతీయ స్థాయి అవార్డు
సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ (Safai Mitra Suraksha Challenge) కార్యక్రమం పూర్తిగా పారిశుద్ధ్య కార్మికుల భద్రత, పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మెరుగుపర్చనున్నారు. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ మొదటి సారిగా దేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో రాష్ట్రాల కేటగిరిలో తెలంగాణ అవార్డును దక్కించుకుంది. ఏ స్థానం అనేది అవార్డుల పంపిణీ రోజున ప్రకటిస్తారు. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో ఎంపికైన టాప్ - 3 పట్టణ స్థానిక సంస్థలకు నగదు పురస్కారాన్ని అందిస్తారు. జనాభా ప్రాతిపదికన పట్టణాలను విభజించారు.