తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ మిలియన్​మార్చ్​కు ఆటో డ్రైవర్స్ ఐకాస మద్దతు - వెస్ట్ జోన్ ఆర్టీఓ వెంకటేశ్వర రావు

ఆర్టీసీ కార్మికులు యూనియన్లకు  దూరం ఉండటం అంటే తల్లిదండ్రులకు పిల్లలు దూరమవడమే అని రాష్ట్ర ఆటో డ్రైవర్స్​ ఐకాస కన్వీనర్​ మహమ్మద్​ అమనుల్లా ఖాన్​ అన్నారు. అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ కార్మిక పోరాట రత్న బిరుదును ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు.

"అశ్వత్థామకు 'ఆర్టీసీ పోరాట రత్న' బిరుదునిస్తున్నాం"

By

Published : Nov 8, 2019, 8:20 PM IST

"అశ్వత్థామకు 'ఆర్టీసీ పోరాట రత్న' బిరుదునిస్తున్నాం"

ఆర్టీసీ మిలియన్ మార్చ్​కు ఆటో డ్రైవర్ ఐకాస మద్దతు ప్రకటించింది. రేపు ట్యాంక్ బండ్​పై తలపెట్టిన మిలియన్ మార్చ్​కు రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ తరలిరావాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్​ ఐకాస కన్వీనర్ మహమ్మద్ అమనుల్లాఖాన్ హైదరాబాద్​లో కోరారు. యూనియన్లకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు. కార్మికులను, యూనియన్​లకు దూరం చేస్తే పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసినట్లేనని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్​కు చరిత్ర హీనుడు బిరుదు:

ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశగా వ్యవహరిస్తున్న కేసీఆర్​కు చరిత్రహీనుడు అనే బిరుదును త్వరలో ప్రగతి భవన్​కు వెళ్లి ఇవ్వనున్నట్లు అమనుల్లాఖాన్​ తెలిపారు. ఎంతో ధైర్యసాహసాలతో ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేస్తున్న ఐకాస కన్వీనర్​​ అశ్వత్థామ రెడ్డికి 'ఆర్టీసీ కార్మిక పోరాట రత్న' బిరుదును ఇస్తామన్నారు. విధుల్లో అవినీతి, అలసత్వం వహిస్తున్న వెస్ట్ జోన్ ఆర్టీఓ వెంకటేశ్వర రావును వెంటనే బదిలీ చేయాలని అమనుల్లా డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై విచారణ వాయిదా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details