Telangana Assembly Speaker Gaddam Prasad Kumar 2023 : రాష్ట్ర మూడో అసెంబ్లీకి స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్(prasad kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సహా మంత్రులు కలిసి ప్రసాద్‌కుమార్‌ని సభాపతి స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Assembly Sessions 2023 : ముఖ్యమంత్రి, శాసనసభ నాయకుడి హోదాలో తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మంచి సంప్రదాయానికి సభ తొలిరోజే నాంది పలికిందన్న రేవంత్ రెడ్డి భవిష్యత్‌లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని ఆకాక్షించారు. వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరని, అక్కడి నుంచి వచ్చిన ప్రసాద్ కుమార్ సమాజంలో ఎన్నో రుగ్మతలకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. వికారాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని ముఖ్యమంత్రి(Revanth Reddy) కొనియాడారు.
తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నిక ఏకగ్రీవం - నేడు అధికారిక ప్రకటన
Deputy CM Bhatti Vikramarka : స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అభినందనలు తెలిపారు. గడ్డం ప్రసాద్ మంత్రిగా ఉన్నప్పుడు చేనేతల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. అప్పట్లో గడ్డం ప్రసాద్‌తో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం దిశగా స్పీకర్ సలహాలు ఇవ్వాలని కోరారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన విపక్షాలకు ధన్యవాదాలు చెప్పారు.