Telangana Assembly Today: బడ్జెట్ పద్దులపై శాసనసభలో ఇవాళ మూడో రోజు చర్చ జరగనుంది. గత రెండు రోజుల్లో 17 పద్దులపై అసెంబ్లీలో చర్చించి ఆమోదించారు. ఇవాళ మరో పది పద్దులపై సభలో చర్చించనున్నారు. విద్య, వైద్య, పురపాలక, క్రీడలు, పర్యాటకం, కార్మిక, దేవాదాయ, అటవీశాఖల పద్దులను ఇవాళ చర్చకు తీసుకోనున్నారు. రెండు బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ బిల్లుతో పాటు వ్యవసాయ మార్కెట్ల చట్టసవరణ బిల్లును మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు.
Telangana Assembly Today: సభలో మూడో రోజు బడ్జెట్ పద్దులపై చర్చ - అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly Today: శాసనసభలో బడ్జెట్ పద్దులపై మూడో రోజు చర్చ జరగనుంది. మరో పది పద్దులపై ఇవాళ చర్చను చేపట్టనున్నారు.విద్య, వైద్య, పురపాలక, క్రీడలు, పర్యాటకం, కార్మిక, దేవాదాయ, అటవీశాఖల పద్దులను ఇవాళ చర్చకు తీసుకోనున్నారు.
Telangana Assembly Today: సభలో మూడో రోజు బడ్జెట్ పద్దులపై చర్చ
చేపల పెంపకం, ఎస్ఎన్డీపీ పనులు, నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీలో ఆర్టీసీ బస్సులు, నేత కార్మికుల సంక్షేమం, ఓఆర్ఆర్ సమీపంలోని గ్రామాలకు తాగునీరు, జర్నలిస్టుల సంక్షేమం, కొత్త మండలాల్లో అన్ని శాఖలకు భవన సముదాయాలు తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి.
ఇదీ చదవండి: