Telangana Assembly Sessions Today Live News 2023 :శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల కానుంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సమావేశాల్లోనే ఆదాయం, వ్యయాలు, అప్పుల గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రమాణస్వీకారం చేసిన రోజే సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్వహించారు. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ శ్వేతపత్రాన్ని తయారు చేసింది. 2014 జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావం మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2023 డిసెంబర్ ఏడో తేదీ వరకు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేలా దీన్ని సిద్ధం చేశారు.
Telangana Govt White Paper On State Finance in Assembly: ప్రధానంగా ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, అన్ని రకాలుగా చేసిన ఖర్చు, తదితరాలకు సంబంధించిన గణాంకాలతో శ్వేతపత్రాన్ని రూపొందించారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న రుణాలపై ఎక్కువగా దృష్టి సారించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అప్పులమయం చేశారో వివరించాలన్న ప్రధాన ఉద్దేశంతో రేవంత్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేస్తోంది.
ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలతో పాటు విద్యుత్ కార్పొరేషన్లు, పౌరసరఫరాల సంస్థ, నీటిపారుదల ప్రాజెక్టుల కార్పొరేషన్లు, మిషన్ భగీరథ కార్పొరేషన్, తదితర సంస్థల ద్వారా తీసుకున్న రుణాల పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. గవర్నర్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
విద్యుత్ వ్యవస్థలు, పౌరసరఫరాల సంస్థ భారీగా అప్పుల్లో కూరుకుపోయాయని అన్ని శాఖల పరిస్థితి కూడా ఇంతే ఉందని ప్రభుత్వం తెలిపింది. కార్పొరేషన్ల పేరిట భారీగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని... ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశారని ఆక్షేపించింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేశారన్న ప్రభుత్వం గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించినట్లు పేర్కొంది.
'సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది - తెలంగాణ, ఏపీలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీ'