Telangana Assembly Sessions Live News Today 2023 :విద్యుత్‌రంగంపై (Power Sector) రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్, బుధవారం నాడు శాసనసభ వేదికగా ఆర్థికరంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి సమావేశాల్లో విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. దీన్ని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. అనంతరం రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.
Telangana Assembly Sessions 2023 :గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా, రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో రూ.50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర సర్కార్ తెలిపింది. అప్పులు, నష్టాలతో పాటు కరెంట్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. అనంతరం తెలంగాణలో విద్యుత్‌రంగం స్థితిగతులు - శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
హరీశ్‌రావు వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - మోటార్లకు మీటర్ల విషయంలో మాటల యుద్ధం
White Paper on Economic Status of Telangana :రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బుధవారం నాడు శాసనసభా వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ సర్కార్ హయాంలో ఆర్థిక విధ్వంసం, వనరులు ఎలా దుర్వినియోగం అయ్యాయో వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేయాలని కాకుండా, రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకెళ్లాల్సిన పెద్ద సవాల్ ఉందని చెప్పారు. కొందరికి చేదుగా ఉన్నప్పటికీ అందరూ జీర్ణించుకోవాల్సిన అవసరం ఉందని భట్టి వివరించారు.