బడ్జెట్ పద్దులపై ఇవాళ్టి నుంచి చర్చ ప్రారంభం కానుంది. 2020- 21 బడ్జెట్‌పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం పూర్తైన నేపథ్యంలో శాసనసభలో నేటి నుంచి పద్దులపై చర్చిస్తారు. ఈరోజు సంక్షేమ పద్దులపై చర్చ ఉంటుంది. గృహనిర్మాణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా- శిశు సంక్షేమ శాఖ పద్దులపై చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది.
బడ్జెట్ పద్దులపై ఇవాళ్టి నుంచి చర్చ
2020- 21 బడ్జెట్‌పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం పూర్తైన నేపథ్యంలో శాసనసభలో నేటి నుంచి పద్దులపై చర్చ ప్రారంభంకానుంది.
పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ చేపడతారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో జిల్లా సమీకృత కార్యాలయాలు, విదేశీవిద్య కోసం ఉపకారవేతనాలు, వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ- పర్యాటక కేంద్రంగా నల్లమల, లాభదాయక సంస్థగా ఆర్టీసీ తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. పల్లెప్రగతిపై మండలిలోనూ స్వల్పకాలిక చర్చ ఉంది.
ఇవీ చూడండి:'పారాసెటమాల్తోనే కరోనాకు చికిత్స!'