Telangana Assembly Sessions 2023 :రాష్ట్రంలో రేపు ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం జరగనుంది. తెలంగాణ మూడో అసెంబ్లీ ప్రారంభం కానుంది. రేపు శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ సభ్యులచేత ప్రొటెం స్పీకర్(Protem Speaker) ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులైన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్టం ఆవిర్భావం తర్వాత నవంబర్ 30న మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సీపీఐతో కలిసి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీని ఓడించింది. 65 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 39 స్థానాలతో సరిపెట్టుకుంది.
Telangana Assembly Sessions Start Tommorow :గురువారంతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కొలువుదీరింది. సీఎంగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy), 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అదేరోజు తొలి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, రేపు శాసనసభలో ప్రమాణస్వీకారం చేయించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ గర్నవర్ సమక్షంలో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ శాసనసభలో అధ్యక్ష స్థానంలో ఉండి, 118 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
Telangana Assembly Session 2023 To Begin Tomorrow :శాసనసభలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఆ ప్రకారం చూస్తే ప్రస్తుతం సభలో అందరి కన్నా సీనియర్ మాజీ సీఎం కేసీఆర్. ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఎవరైనా ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించడానికి అర్హత ఉంటుంది. వీరిలో అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేశారు.
Congress Government in Telangana 2023 :అయితే స్పీకర్‌గా ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 10వ తేదీ లేదా 11వ తేదీన స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నికలో ఏకగ్రీవం కానున్నారు. కాగా, రేపు జరగబోయే శాసనసభ కేవలం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాల వరకే పరిమితమవుతుందని సంబంధింత వర్గాల సమాచారం.
సీఎం హోదాలో తొలిసారి దిల్లీకి రేవంత్ రెడ్డి
ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన - తమ సమస్యలను సీఎంకు విన్నవించుకున్న ప్రజలు