తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ మరోమారు ఆమోదం - Telangana Legislative Council Sessions 2023

assembly
assembly

By

Published : Aug 4, 2023, 10:10 AM IST

Updated : Aug 4, 2023, 10:17 PM IST

22:15 August 04

పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లుకు శాసనసభ మరోమారు ఆమోదం

డీఎంఈ పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లుకు అసెంబ్లీ మరోమారు ఆమోదం

పురపాలక పౌరుల భాగస్వామ్యం పెంచాలని సవరణ తీసుకొచ్చాం: కేటీఆర్‌

మైనార్టీలకు అదనంగా చేసిందేమీ లేదు: మంత్రి కేటీఆర్‌

గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాల్లో రాజకీయం తప్ప మరొకటి లేదు: కేటీఆర్‌

22:14 August 04

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ మరోమారు ఆమోదం

  • నిపుణుల సిఫారసులకు అనుగుణంగానే చట్ట సవరణ చేశాం: మంత్రి సబిత
  • కొత్తగా 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులు: మంత్రి సబిత
  • భూమి, బిల్డింగ్ ప్లాన్స్ సరిగ్గా లేవని గవర్నర్ అభ్యంతరం తెలిపారు: మంత్రి సబిత
  • చట్టంలో భూమి, బిల్డింగ్ అంశాలు లేవు: మంత్రి సబిత
  • వీసీల అభిప్రాయాలు లేవని గవర్నర్‌ అన్నారు: మంత్రి సబిత
  • ఇన్‌ఛార్జ్‌ వీసీలుగా ఉన్న ఐఏఎస్ అధికారుల అభిప్రాయాలు ఉన్నాయి: మంత్రి సబిత

20:20 August 04

పదేళ్లలో వైద్య రంగంపై రూ.73 వేల కోట్లు కేటాయించాం: మంత్రి హరీశ్‌రావు

  • వైద్యానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించింది
  • వైద్యానికి ఈ ఏడాది రూ.12 వేల కోట్లకు పైగా కేటాయించాం
  • ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించగలుగుతున్నాం
  • పల్లెప్రగతి, పట్టణప్రగతి వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడింది: మంత్రి హరీశ్‌రావు
  • పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల పేరుతో ప్రాథమిక దశ నుంచి వైద్యం అందిస్తున్నాం

19:20 August 04

విద్యపై ఈ ఏడాది 29,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • ఇవాళ గురుకులాల్లో 7.5 లక్షల మంది చదువుకుంటున్నారు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

19:19 August 04

విద్యలో తెలంగాణ చివరి నుంచి ఆరోస్థానంలో ఉంది: భట్టి విక్రమార్క

  • ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే మనకంటే తక్కువ ర్యాంకుల్లో ఉన్నాయి
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నామమాత్రంగా మిగిలింది: భట్టి
  • ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు
  • వైద్య విద్య ఫీజులు భారీగా పెంచి పేదలకు భారంగా మార్చారు
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించే సిబ్బంది లేరు: భట్టి
  • ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే ఇల్లు, పొలం అమ్ముకునే పరిస్థితి వస్తోంది: భట్టి
  • ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించేందుకు ఇంకా ఖాళీ స్థలం ఉంది: భట్టి
  • హైదరాబాద్‌ చుట్టూ 5 ఆస్పత్రులు కడతామని ఒక్కటైనా నిర్మించారా?: భట్టి
  • 9 ఏళ్లల్లో కొత్తగా ఒక్క ఆస్పత్రినైనా నిర్మించారా?: భట్టి విక్రమార్క
  • భారాస పార్టీకి ఉపయోగపడేవి నిర్మించి.. ప్రజలకు ఉపయోగపడేవి నిర్మించట్లేదు

18:51 August 04

అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రులకు అదనంగా రూపాయి కూడా ఇవ్వలేదు

  • అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రులకు వైద్య సిబ్బందిని కేటాయించ లేదు
  • ఏఎన్‌ఎంలకు అందరికీ సమాన వేతనం ఇవ్వాలి: ఈటల రాజేందర్‌
  • ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోంది కానీ... అమలు చేయటం లేదు
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలు, వసతులను పెంచాలి: ఈటల
  • వైద్యశాఖకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయాలి: ఈటల
  • వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ పెంచాలి: ఈటల రాజేందర్‌
  • అన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు ప్రతి నెలా చెల్లించాలి

18:38 August 04

అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రులకు అదనంగా రూపాయి కూడా ఇవ్వలేదు : ఈటల రాజేందర్‌

  • అప్‌గ్రేడ్‌ చేసిన ఆస్పత్రులకు వైద్య సిబ్బందిని కేటాయించ లేదు : ఈటల రాజేందర్‌
  • ఏఎన్‌ఎంలకు అందరికీ సమాన వేతనం ఇవ్వాలి: ఈటల రాజేందర్‌
  • ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోంది కానీ... అమలు చేయటం లేదు
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలు, వసతులను పెంచాలి: ఈటల
  • వైద్యశాఖకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయాలి: ఈటల
  • వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ పెంచాలి: ఈటల రాజేందర్‌
  • అన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు ప్రతి నెలా చెల్లించాలి

18:14 August 04

కంటింజెంట్‌ సిబ్బందికి కనీసం రూ.10వేలు చెల్లించాలి: ఈటల

  • చాలా ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు లేని దుస్థితి: ఈటల రాజేందర్‌
  • ఇప్పటికీ దాదాపు 30 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్నారు
  • ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించాల్సిన అవసరం ఉంది
  • కేజీబీవీల్లోని బోధన, బోధనేతర సిబ్బందిని క్రమబద్ధీకరించాలి
  • కేజీబీవీ సిబ్బందిని చాలా రాష్ట్రాల్లో క్రమబద్ధీకరించారు: ఈటల
  • పొరుగు రాష్ట్రాల్లో కేజీబీవీ సిబ్బందికి రూ.30 వేలకు పైగా వేతనం ఇస్తున్నారు
  • విద్యా సంస్థల్లో ఇన్‌ఛార్జిలను కాకుండా పూర్తిస్థాయి అధికారులను నియమించాలి
  • జూనియర్‌ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లను ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయాలి
  • జూనియర్‌ కళాశాల లెక్చరర్లను ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయాలి
  • జూనియర్‌ లెక్చరర్లకు 12 నెలలకు వేతనం చెల్లించాలి: ఈటల రాజేందర్‌
  • ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం అవుతున్నాయి: ఈటల
  • పేద విద్యార్థులు ఉంటున్న ప్రభుత్వ వర్సిటీల్లో కొత్త హాస్టళ్లు నిర్మించాలి
  • ఉస్మానియా వర్సిటీ 18 ర్యాంకులు కోల్పోయింది: ఈటల రాజేందర్‌

16:24 August 04

శాసనసభ నుంచి వాకౌట్‌ చేసిన కాంగ్రెస్‌ నేతలు

  • వరదల నష్ట పరిహారం ప్రకటించాలని కాంగ్రెస్ నేతల డిమాండ్‌
  • ప్రభుత్వం పరిహారం ప్రకటించలేదని నిరసనగా సభ నుంచి వాకౌట్‌

16:05 August 04

అన్ని నివేదికలు వచ్చాక పంటనష్టం పరిహారంపై నిర్ణయం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

  • గత మూడేళ్లుగా జీహెచ్‌ఎంసీలో వరదల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి
  • వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి వల్ల జీహెచ్‌ఎంసీలోనూ రోడ్ల నష్టం తగ్గుతోంది
  • వ్యూహాత్మక నాలాల అభివృద్ధి వల్ల జీహెచ్‌ఎంసీలోనూ నష్టం తగ్గుతోంది
  • పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేపట్టిన చర్యల వల్ల నష్ట తీవ్రత తగ్గుతోంది
  • పూర్తిగా కూలిన ఇళ్లు 419, పాక్షికంగా కూలిన 7500 ఇళ్లు ఉన్నాయి
  • వరదల ఇల్లు కూలిన వారికి గృహలక్ష్మి పథకం ఆర్థికసాయం చేస్తాం
  • కేంద్రప్రభుత్వ సహాయం కోసం ఎప్పుడూ ఎదురుచూడలేదు
  • కేంద్రం సహాయం చేసినా.. చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది
  • కేంద్రం తెచ్చిన ఫసల్‌ బీమాను గుజరాత్‌ రాష్ట్రమే అమలు చేయట్లేదు
  • గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారాన్ని కూడా కేసీఆర్‌ ప్రభుత్వం చెల్లించింది
  • 2009 – 2012 వరకు ప్రకటించిన పరిహారాలను 2014లో కేసీఆర్‌ ప్రభుత్వం చెల్లించింది
  • వరదల్లో 1500 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించాం
  • 770 నివాసాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించాం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • 139 గ్రామాల్లో వరదల నష్టం ఎక్కువ జరిగింది: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గింది
  • ఆపత్కాలంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది కూడా చాలా కృషి చేశారు
  • భారీ వరదల్లో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సిబ్బంది పనులు చేశారు
  • మిషన్‌ కాకతీయ వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • మిషన్‌ కాకతీయ వల్ల చెరువులు బలపడి నష్ట తీవ్రత తగ్గింది: ప్రశాంత్‌రెడ్డి
  • మిషన్‌ కాకతీయకు ముందు ఏటా వేల సంఖ్యలో చెరువులకు గండ్లు పడేవి
  • మిషన్‌ భగీరథ సిబ్బంది కూడా చాలా వేగంగా నీటి సరఫరాను పునరుద్ధరించారు

14:23 August 04

వరదల్లో నష్టపోయిన వారికి పరిహారం ప్రకటించాలి: అక్బరుద్దీన్‌

  • వరదల్లో 42 మంది చనిపోయారని పత్రికల్లో వచ్చింది: అక్బరుద్దీన్‌
  • ప్రభుత్వ ప్రకటనలో మాత్రం మృతుల సంఖ్య గురించి లేదు: అక్బరుద్దీన్‌
  • 7,900 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా ధ్వంసం అయ్యాయి: అక్బరుద్దీన్‌
  • వరదలకు అనేక గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి: అక్బరుద్దీన్‌
  • వరద ప్రాంతాల్లో పంటనష్టం వివరాలు సేకరించాలి: అక్బరుద్దీన్‌

14:23 August 04

వరద ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశాయి: శ్రీధర్‌బాబు

  • ఇసుక మేటల విషయంలో ప్రణాళిక రూపొందించాలి: శ్రీధర్‌బాబు
  • ఫసల్‌ బీమా పథకం రాష్ట్రంలో అమలుకావడం లేదు: శ్రీధర్‌బాబు
  • కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా అమలుకాక రైతులు నష్టపోతున్నారు: శ్రీధర్‌బాబు
  • వర్షాల వల్ల 69 చెరువులు తెగిపోయాయి: శ్రీధర్‌బాబు
  • వరద బాధితులను వెంటనే ఆదుకోవాలి: శ్రీధర్‌బాబు
  • వరద బాధితులకు డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలి: శ్రీధర్‌బాబు
  • అధికార పార్టీ నేతలే అబద్ధాలు మాట్లాడుతున్నారు: శ్రీధర్‌బాబు

14:22 August 04

మంజీరా నదిపై అనేక చెక్‌ డ్యామ్‌లు కట్టాం: మంత్రి హరీశ్‌రావు

  • చెక్‌డ్యామ్‌లు కట్టిన కేసీఆర్‌కు రైతులు పాలాభిషేకం చేస్తున్నారు: హరీశ్‌

13:34 August 04

50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడైనా రైతుబీమా ఇచ్చారా?: కేటీఆర్‌

13:25 August 04

  • వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై శాసనసభలో స్వల్పకాలిక చర్

చర్చను ప్రారంభించిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

13:00 August 04

మణిపూర్‌లో ఎందుకు గొడవలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు: కేటీఆర్‌

  • పలు రాష్ట్రాల్లో జరుగుతున్న మత ఘర్షణలను ఖండిస్తున్నాం: కేటీఆర్‌
  • జయపుర ఘటనలో గాయపడిన హైదరాబాద్ కుటుంబాన్ని అదుకుంటాం: కేటీఆర్‌

11:53 August 04

తెలంగాణ రాక ముందు మనకు 5 వైద్య కళాశాలలే ఉండేవి: హరీశ్‌రావు

  • మా ఒత్తిడి వల్లే 2008లో రిమ్స్, 2013లో నిజామాబాద్ వైద్య కళాశాల వచ్చాయి: హరీశ్‌రావు
  • తొమ్మిదేళ్లలో 29 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశాం: హరీశ్‌రావు
  • రాష్ట్రంలో వైట్‌ కోట్ రెవల్యూషన్ తీసుకొచ్చాం: హరీశ్‌రావు
  • దేశం మొత్తం వైద్యులను సరఫరా చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది: హరీశ్‌రావు
  • ధాన్యం ఉత్పత్తిలో, వైద్యుల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉంది: హరీశ్‌రావు
  • బీ కేటగిరీలో కూడా తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నాం: హరీశ్‌రావు
  • కోర్టు నుంచి అనుమతి వస్తే అధునాతన ఉస్మానియా ఆసుపత్రి కడతాం: హరీశ్‌రావు
  • కొత్తగా మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థులకు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధించాము: హరీశ్‌రావు
  • ఒకేసారి 852 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాం: హరీశ్‌రావు
  • కొత్తగా వచ్చే 8 మెడికల్ కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: హరీశ్‌రావు

11:13 August 04

ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్‌ తమిళిసై

  • ఈ శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టాలని భావించిన ప్రభుత్వం
  • ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం
  • రెండ్రోజులు గడచినా రాజ్‌భవన్ నుంచి ప్రభుత్వానికి అందని ఆర్టీసీ బిల్లు
  • ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఇటీవల క్యాబినెట్‌ నిర్ణయం
  • క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా బిల్లు రూపొందించిన ప్రభుత్వం

11:07 August 04

హైదరాబాద్‌లోని హెరిటేజ్ భవనాలను రక్షించుకుంటాం: కేటీఆర్‌

  • కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను ఇప్పటికే వారసత్వ సంపదగా గుర్తించారు: కేటీఆర్‌
  • ముఖ్యమంత్రిగా మూడోసారి కూడా కేసీఆరే అవుతారు: కేటీఆర్‌

11:05 August 04

శాసనసభ ముట్టడికి ఎన్ఎస్‌యూఐ యత్నం

  • ఎన్ఎస్‌యూఐ ప్రతినిధులను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌
  • పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఎన్ఎస్‌యూఐ డిమాండ్

10:47 August 04

రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి: కేటీఆర్‌

  • కోకాపేటలో భూముల ధర రికార్డులు బద్ధలుకొట్టింది: కేటీఆర్‌

10:16 August 04

రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి: కేటీఆర్‌

  • ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి: కేటీఆర్‌
  • రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయి: కేటీఆర్‌
  • స్టేబుల్ గవర్న్‌మెంట్‌.. ఏబుల్ లీడర్‌షిప్‌ వల్లే ఇదంతా సాధ్యం: కేటీఆర్‌
  • గురుగ్రామ్‌లో ఐటీ పరిశ్రమను నాశనం చేస్తున్నారు: కేటీఆర్‌
  • హైదరాబాద్‌లో 1987లో మొట్టమొదట ఐటీ పరిశ్రమ వచ్చింది: కేటీఆర్‌
  • తెలంగాణ వచ్చేటప్పటికి మన ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లు: కేటీఆర్‌
  • ఒక్క గతేడాదే మన ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు: కేటీఆర్‌
  • ద్వితీయశ్రేణి నగరాలకూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది: కేటీఆర్‌
  • దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణవే: కేటీఆర్‌
  • పట్టణాలు, నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాయి: కేటీఆర్‌
  • ప్రతిచోటా అంతర్జాతీయ ప్రమాణాలు తట్టుకుని నిలబడాలి: కేటీఆర్‌

10:16 August 04

పాతబస్తీలో ఐటీ టవర్‌ పనులు ఎప్పుడు చేపడతారు: అక్బరుద్దీన్‌

  • చిన్న చిన్న ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌ల్లో మైనార్టీలకు అవకాశం ఇవ్వాలి: అక్బరుద్దీన్‌

10:15 August 04

నిజామాబాద్‌కు ఐటీ హబ్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు: జీవన్‌రెడ్డి

  • తెలంగాణలో ఐటీ రివల్యూషన్‌ వచ్చింది: జీవన్‌రెడ్డి
  • ఐటీ ఐకాన్‌, ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ.. కేటీఆర్‌..: జీవన్‌రెడ్డి
  • దేశంలో వచ్చే 2 ఐటీ ఉద్యోగాల్లో ఒకటి ఇక్కడే వస్తుంది: జీవన్‌రెడ్డి

10:06 August 04

2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయి: కేటీఆర్‌

  • ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి: కేటీఆర్‌
  • కొత్త రాష్ట్రం వచ్చాక6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయి: కేటీఆర్‌

09:47 August 04

సభలో 7 బిల్లులు ప్రవేశపెట్టనున్న మంత్రులు

ఉదయం 10 గంటల నుంచి శాసనసభ సమావేశాలు, మొదట ప్రశ్నోత్తరాలు

  • సభలో 7 బిల్లులు ప్రవేశపెట్టనున్న మంత్రులు, అనంతరం స్వల్ప కాలిక చర్చ
  • వర్షాలు, వరద సాయంపై శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్
  • పంచాయతీల్లో కార్మికుల సమస్యపై మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్
  • వరదల తర్వాత పునరావాసం, సహాయ చర్యలపై బీజేపీ వాయిదా తీర్మానం
Last Updated : Aug 4, 2023, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details