02:25 PM
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ముగిసిన మంత్రివర్గ సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. రేపటి గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినంది.
01:13 PM
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
01:04 PM
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది. అసెంబ్లీ హాలులో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
12:47 AM
కాసేపట్లో ప్రారంభంకానున్న మంత్రివర్గ సమావేశం
కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభంకానుంది.
11:57 AM
ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు: కొండా సురేఖ
ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. స్పీకర్ శాసనసభకు తండ్రిలాంటివారని పేర్కొన్నారు. స్పీకర్ పదవికే గడ్డం ప్రసాద్ వన్నె తెస్తారని ఆశిస్తున్నామన్నారు.
11:50 AM
స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు: సీతక్క
స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సీతక్క అభినందనలు చెప్పారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ జీవితం అణగారిన వర్గాలకు ఆదర్శమని తెలిపారు. గడ్డం ప్రసాద్‌కుమార్ ఒదిగి ఎదిగారని సీతక్క వెల్లడించారు.
11:31 AM
స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు: తలసాని
స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ పవిత్రమైందని ఆయన పేర్కొన్నారు.
11:27 AM
స్పీకర్ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్‌కు అభినందనలు: కూనంనేని
స్పీకర్ బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్‌కు కూనంనేని అభినందలు తెలిపారు. శాసనసభ దేవాలయం లాంటిదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిపుష్టికి ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ పనిచేయాలని సూచించారు.
11:20 AM
స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు: కేటీఆర్
స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు కేటీఆర్ అభినందనలు చెప్పారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. కేసీఆర్ ఆదేశాలతో ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ సహకరించిందని పేర్కొన్నారు. ఎంపీటీసీ నుంచి స్పీకర్‌గా ఎదిగిన గడ్డం ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకమని వివరించారు.
11:17 AM
స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు అభినందనలు: భట్టి విక్రమార్క
స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు భట్టి విక్రమార్క అభినందనలు చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ చేనేతల సమస్యలను పరిష్కరించారని గుర్తుచేశారు. గడ్డం ప్రసాద్‌తో కలిసి పనిచేసినందుకు గర్విస్తున్నామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్ సలహాలు ఇవ్వాలని కోరారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన విపక్షాలకు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.
11:08 AM
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు: రేవంత్
స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. మంచి సంప్రదాయానికి సభ తొలిరోజే నాంది పలికిందని చెప్పారు. భవిష్యత్‌లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని కోరారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని సూచించారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని రేవంత్ వెల్లడించారు.
11:06 AM
శాసనసభ సమావేశాలు ప్రారంభం
ఎమ్మెల్యేగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేశారు. ఎమ్మెల్యేలుగా కేటీఆర్, కడియం శ్రీహరి, కౌశిక్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణం చేశారు.
10:50 AM
శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్
శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్‌ను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్‌కుమార్ పేరు ప్రతిపాదించిన 23 మంది సభ్యులు ప్రతిపాదించారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్ స్థానంలో రేవంత్, భట్టి కూర్చోబెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
10:35 AM
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం- ప్రమాణం చేస్తున్న మిగిలిన సభ్యులు
10:15 AM
అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఇవాళ్టి నుంచి తెలంగాణలో శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు.
09:30 AM
నేడు మంత్రివర్గ సమావేశం- గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం
నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
09:22 AM
స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికకానున్న గడ్డం ప్రసాద్ కుమార్
స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. స్పీకర్‌గా ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికకానున్నారు. నేడు అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు. తదుపరి బాధ్యతల స్వీకరణ ఉండనుంది. ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం కానున్నారు.
09:00 AM
మిగిలిన సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత సభాపతి ఎన్నిక
నేడు ఉదయం 10.30 గంటలకు శాసనసభ సమావేశం జరగనుంది. మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత సభాపతి ఎన్నిక జరగనుంది. సభాపతి ఎన్నిక దృష్ట్యా శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఉభయసభ సభ్యులను ఉద్దేశించి రేపు గవర్నర్ తమిళిసై ప్రసంగం ఉండనుంది.