Telangana Assembly Passes Rejected Bills :గతంలో శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్అభ్యంతరాలు వ్యక్తం చేసి వెనక్కు పంపారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నాలుగు బిల్లులను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టి మళ్లీ చర్చించారు. పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచాలని పురపాలక నిబంధనల చట్టసవరణ తీసుకొచ్చామన్న మంత్రి కేటీఆర్.. మైనార్టీలకు అదనంగా ఎలాంటి లబ్ధి చేసిందేమిలేదని తెలిపారు.
Telangana Assembly Sessions 2023 : ప్రభుత్వ వైద్య కళాశాలలు పెరిగిన నేపథ్యంలో వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టులకు ఇబ్బందులు లేకుండా డీఎంఈ పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చామన్న మంత్రి హరీశ్ రావు.. మళ్లీ ఎవరినో తీసుకొచ్చి నియామకం చేస్తారన్న అపోహ తగదని చెప్పారు. నిపుణుల సిఫారసులకు అనుగుణంగానే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణ చేసి కొత్తగా ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను చేర్చినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
"పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచాలని పురపాలక నిబంధనల చట్టసవరణ తీసుకొచ్చాము. ఈ బిల్లులో మైనార్టీలకు అదనంగా ఎలాంటి లబ్ధి చేసిందేమిలేదు. శాసనసభ ఆమోదించిన బిల్లులను.. గవర్నర్ అభ్యంతరాల పేరుతో రాజకీయం చేస్తున్నారు." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి
Etela Rajender Speech in Assembly 2023 : 'ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోందే కానీ.. అమలు చేయట్లేదు'
Rejected Bills Passed in Telangana Assembly :భూమి, బిల్డింగ్ ప్లాన్స్ సరిగ్గా లేవని గవర్నర్ అభ్యంతరం తెలిపారన్న మంత్రి.. చట్టంలో ఆ అంశాలు లేవని వివరించారు. అనుమతులు రాకముందే విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థుల పరిస్థితి ఏంటని మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కోర్సులను పెంచితే బాగుంటుందన్న కాంగ్రెస్ శాససభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క.. ఆమోదం లేకముందే ప్రవేశాలు చేస్తోంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.