తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫలితాలపై పూర్తి ధీమాతో గులాబీ దళపతి - ప్రగతిభవన్​కు రంగులు దానికి సంకేతమేనా? - తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ 2023

Telangana Assembly Elections Results 2023 : రేపు తేలనున్న భవితవ్యంపై గులాబీ పార్టీ పూర్తి ధీమాతో ఉంది. రాష్ట్రాన్ని మళ్లీ పాలించేది బీఆర్​ఎస్​ పార్టీయేనని ఆ పార్టీ అధినేత నుంచి అభ్యర్థుల వరకూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసి గాబరా పడొద్దని, వాస్తవ ఫలితాలు అనుకూలంగా ఉంటాయని నేతలకు కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు. పోలింగ్​పై వివిధ ఏజెన్సీలతో నివేదికలు తెప్పించుకొని రెండు రోజులుగా విశ్లేషిస్తున్న సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో కేటీఆర్, హరీశ్​రావు, ఇతర ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.

CM KCR Confident on Elections Results 2023
Telangana Assembly Elections Results 2023

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 7:32 PM IST

Telangana Assembly Elections Results 2023 : ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రమంతటా ఉత్కంఠ పెరుగుతుండగా భారత రాష్ట్ర సమితి మాత్రం విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులవుతాయన్న విశ్వాసంతో గులాబీ పార్టీ కనిపిస్తోంది. పోలింగ్ సరళిపై వివిధ ఏజెన్సీలతో నివేదికలు తెప్పించి బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు విశ్లేషించారు. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ ప్రగతిభవన్​లో రెండు రోజులుగా కేటీఆర్, హరీశ్​రావు, ఇతర ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్​తో పరేషాన్ కావొద్దని, మళ్లీ బీఆర్​ఎస్​ పార్టీనే విజయం సాధించబోతున్నదని ప్రగతిభవన్ వెళ్లిన పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

రేపే జడ్జిమెంట్ డే- ఎలక్షన్ కౌంటింగ్​కు ఈసీ ఏర్పాట్లు పూర్తి

CM KCR Confident on Elections Results 2023 : ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని, రాష్ట్రాన్ని మళ్లీ పాలించబోయేది తమ పార్టీయేనని కేసీఆర్ పార్టీ నేతలతో చెప్పారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుందామని అన్నారు. మరోవైపు పోలింగ్ జరుగుతుండగానే కేసీఆర్ తన సన్నిహితులు, సిద్ధాంతులతో ప్రమాణ స్వీకారంపై చర్చించారు. సచివాలయం ఆవరణలో ప్రమాణ స్వీకారం చేసి, అసైన్డ్ భూములకు హక్కులపై తొలి సంతకం చేయనున్నట్లు సన్నిహితులతో కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. కనీసం 70 సీట్లకు తక్కువ రావంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడంతో పాటు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్కువ చేసి చూపించినా వాస్తవ ఫలితాలు తమకే శుభవార్త చెబుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.

ఓట్ల లెక్కింపుపై పోలీసులకు డీజీపీ కీలక సూచనలు - ఆ విషయంలో అలెర్ట్​గా ఉండాలంటూ ఆదేశాలు

ప్రగతి భవన్​కు రంగులు అందుకేనా? ఇదిలా ఉండగా ప్రగతిభవన్​కు తాజాగా రంగులు వేస్తున్నారని, అదీ కేసీఆర్ ఆత్మ విశ్వాసమంటూ బీఆర్​ఎస్​ నేత క్రిశాంక్ ఫొటోను ట్వీట్ చేశారు. రేపు తెలంగాణ భవన్​లో సంబురాలకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అంశంపై సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి నేడు మాట్లాడారు. ఎగ్జిట్​ పోల్స్​కు, ఎగ్జాట్​ పోల్స్​కు చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ 70 నుంచి 75 సీట్లతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 1000 శాతం అధికారంలోకి వస్తుందని చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్​పై ఆందోళన వద్దు - రెండు రోజులు ఓపిక పట్టండి, ఎల్లుండి సంబురాలు చేసుకుందాం : సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details