తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Election Result 2023 LIVE: కాంగ్రెస్​కు కలిసొచ్చిన వారసత్వ రాజకీయం - విజయతీరాలకు ఆ కుటుంబాలు - తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్ 2023

Telangana Election Result 2023 LIVE: రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. విశేషమేమిటంటే ఓకే కుటుంబం నుంచి రెండు టికెట్లు పొందిన అభ్యర్థుల్లో చాలా వరకు ఇద్దరూ విజయం సాధించారు. ఇందులో ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, గడ్డం బ్రదర్స్ ఉత్తమ్ కుమార్​రెడ్డి దంపతులు, మైనంపల్లి కుటుంబం ఉన్నారు.

Telangana assembly results Live 2023
Telangana Election Result 2023 LIVE

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 5:32 PM IST

Updated : Dec 3, 2023, 7:26 PM IST

Telangana Election Result 2023 LIVE: తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక్క కుటుంబం నుంచి రెండు టికెట్లను సాధించిన అభ్యర్థుల్లో ఇద్దరు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్​రెడ్డి దంపతులు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు. ఈసారి ఎన్నికల్లో హుజూర్​నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై గెలుపొందారు.

Family Victories in Telangana Assembly Results 2023 :ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలంగాణ ఏర్పాటయ్యాక 2014, 2018 ఎన్నికల్లో హుజూర్​నగర్​ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి నల్లగొండ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25682 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.

Uttam Family Wins Telangana Election 2023 : కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తమ్​కుమార్​ రెడ్డి భార్య ఉత్తమ్​ పద్మావతి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్​పై ఉత్తమ్​ పద్మావతి విజయం సాధించారు. 2019లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చిన ఉప ఎన్నికలో ఉత్తమ్​ పద్మావతి కాంగ్రెస్​ తరఫున బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికలో కోదాడ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు.

Komatireddy Brothers Win Telangana Election 2023 : నల్గొండ జిల్లాలో మరో కీలకనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్​ పార్టీకి స్టార్​ క్యాంపెయినర్​గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై విజయం సాధించారు. మాస్ ఇమేజ్ కలిగిన కోమటిరెడ్డి(Komatireddy Venkatreddy) ఆరోసారి బరిలోకి దిగారు. పట్నం నుంచి ప్రతి పల్లె దాకా పేరు పెట్టి పిలవగలిగేంత చనువు, ఆదరణ ఉండటం ఆయనకు కలిసొచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ దీక్షకు దిగిన చరిత్ర ఆయన సొంతం.

మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డిపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో గెలిచిన రాజగోపాల్‌రెడ్డి అభివృద్ధి కోసం రాజీనామా చేసి అనివార్యంగా వచ్చిన మునుగోడు ఉపపోరులో కమలం పార్టీ తరఫున పోటీచేసి కూసుకుంట్ల చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం సొంత గూటికి చేరిన కోమటిరెడ్డి కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగారు.

కాంగ్రెస్ పార్టీ చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి గడ్డం అన్నదమ్ములకు టికెట్​ ఇచ్చింది. బెల్లపల్లిలో గడ్డం వినోద్ విజయం సాధించారు. ఇక చెన్నూరు నియోజకవర్గం నుంచి గడ్డం వివేక్​ వెంకటస్వామి గెలుపొందారు. బీఆర్​ఎస్ అభ్యర్థి బాల్క సుమన్​పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి చేరిన అనంతరం మైనంపల్లి కుటుంబానికి కూడా రెండు టికెట్లను కేటాయించారు. మైనంపల్లి రోహిత్​రావు మెదక్​ నుంచి పోటీ చేయగా బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మా దేవందర్​రెడ్డిపై విజయం సాధించారు. ఇక మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి మైనంపల్లి హన్మంతరావు ఓటమి చవి చూశారు.

Last Updated : Dec 3, 2023, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details