తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రలోభాలపై ఈసీ ప్రత్యేక నజర్ - గతానుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు

Telangana Assembly Elections Polling Arrangements 2023 : శాసనసభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. గత అనుభవాల నేపథ్యంలో ఇప్పటికే పకడ్బందీ చర్యలు తీసుకున్న ఈసీ.. తాజాగా ప్రత్యేక పరిశీలకులను నియమించింది. నియోజకవర్గాల వారీగా ఉన్న పరిశీలకులకు అదనంగా సాధారణ, పోలీసు, వ్యయపరిశీలకులుగా విశ్రాంత అధికారులను రాష్ట్రానికి పంపింది. సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.

Telangana Assembly Election 2023
Telangana Assembly Elections Arrangements 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 8:33 AM IST

ప్రలోభాలపై ఈసీ ప్రత్యేక నజర్ - గతానుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు

Telangana Assembly Elections Polling Arrangements 2023 :రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ ముందస్తుగా సన్నద్ధమైంది. షెడ్యూల్‌ కంటే ముందే హైదరాబాద్‌లో జరిపిన సన్నద్ధత సమీక్షలో అధికారులకు స్పష్టమైన సంకేతాలిచ్చింది. తనిఖీలు, ప్రలోభాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా సీనియర్ అధికారులు సహా, ఐఏఎస్, ఐపీఎస్​లను పెద్ద ఎత్తున బదిలీ చేసింది. ఫిర్యాదులు, ఇతరత్రా అంశాల దృష్ట్యా అధికారులపై బదిలీ వేటు పడుతూనే ఉంది.

Telangana Election Polling Arrangements 2023: గత అనుభవాలు, ఇటీవలె మునుగోడు ఉప ఎన్నిక ఉదంతాలను కేంద్ర ఎన్నికల సంఘం పదేపదే ప్రస్తావిస్తూ వస్తోంది. ఈసీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు దూకుడు పెంచటంతో భారీగా నగదు, బంగారం, కానుకలు పట్టుబడ్డాయి. 2018 ఎన్నికల్లో స్వాధీనాల మొత్తం రూ.137కోట్ల 97లక్షలు కాగా ఇప్పుడు ప్రకటన వెలువడిన నెల రోజుల్లోనే ఆ మొత్తం రూ. 525కోట్లు దాటింది. అటు ఎన్నికల నిర్వహణ, ఇతర అంశాలతో పాటు ప్రలోభాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపైసీఈసీ ప్రత్యేక దృష్టి సారించింది.

MLA Raghunandan Rao Complaint to EC : 'వారిపై చర్యలు తీసుకోకపోతే దిల్లీ వెళ్లి ఈసీని కలుస్తాం'

Telangana Assembly Election 2023: ఎన్నికల కోసం సాధారణ, పోలీసు వ్యయ పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల అధికారులను నియమిస్తుంటారు. ఈసారి సైతం ఒక్కొక్కరికి ఒకటి లేదా రెండు నియోజకవర్గాలు అప్పగిస్తూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులను నియమించారు. వారికి అదనంగా విశ్రాంత అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా పంపించారు. సాధారణ పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి అజయ్ వి. నాయక్‌, పోలీసు పరిశీలకుడిగా ఐపీఎస్ దీపక్ మిశ్రా, వ్యయ పరిశీలకుడిగా ఐఆర్ఎస్ అధికారి ఆర్.బాలకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేక పరిశీలకులుగా నియమితులైన ముగ్గురు విశ్రాంత అధికారులు ఇప్పటికే రాష్ట్ర అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.

Telangana Assembly Election Arrangements 2023 : నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. పోలింగ్ ఏర్పాట్లపై ఆరా

గత నెల 21న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో వ్యయ పరిశీలన అధికారి బాలకృష్ణన్ విడిగా సమావేశమయ్యారు. నిఘా, తనిఖీలపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రణాళిక, ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎక్కడా ఏమరుపాటు ప్రదర్శించకుండా పకడ్బందీగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిశీలకులు రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. దీపావళి అనంతరం జిల్లాల పర్యటనలకు వెళ్లనుండగా.. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఎన్నికల నియమావళి, శాంతి భద్రతలపై క్షేత్రస్థాయిలో దృష్టిపెట్టనున్నారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేవి తప్ప ఇతర సామాగ్రి సీజ్ చేయొద్దు : సీఈసీ

తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ

ABOUT THE AUTHOR

...view details