Telangana Assembly Elections Polling Arrangements 2023 :రాష్ట్రంలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలకు(Assemble Elections) పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్తో పాటు డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేశారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రిజర్వు ఫోర్స్, ఏఆర్, ఎస్పీఎఫ్‌కు చెందిన అదనపు యూనిట్లు కలిసి దాదాపు 30 వేల మందికి పైగా బందోబస్తులో పాల్గొంటారు. ఇప్పటికే సిబ్బంది కేటాయింపు.. అధికారులకు శిక్షణ పూర్తయ్యాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలు విధుల్లో ఉంటాయి.
Tight Security in Telangana Elections 2023: గత ఎన్నికల్లో ఘర్షణలు జరగడం, ఓటరు గుర్తింపు కార్డులు లేకుండా ఓటింగ్‌లో పాల్గొన్న ఘటనలు, తాజా శాంతి భద్రతల ఆధారంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని గుర్తిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని సుమారు వెయ్యి వరకూ ఇలాంటి కేంద్రాలును గుర్తించారు. మిగతాచోట్ల సాధారణ పోలీసులు గస్తీలో ఉంటారు.
Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా
Security Arrangements in Telangana Elections 2023 :హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ రోజు 391 రూట్ మొబైల్స్, 129 పెట్రోలింగ్ వాహనాలు, 122 ఇతర పోలీసు వాహనాలు గస్తీలో పాల్గొంటాయి. 9 టాస్క్‌ఫోర్స్, 9 స్పెషల్ ఫోర్స్ బృందాలు, 71 మంది ఇన్‌స్పెక్టర్లు, 125 మంది ఎస్సైల్ని సత్వర స్పందన బృందాలుగా విభజించి వేర్వేరు ప్రాంతాల్లో గస్తీలో ఉంచారు. అదనంగా 45 ఫ్లయింగ్ స్వ్కాడ్‌లతో, ముఖ్య ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.