Telangana Assembly Elections Polling 2023 : ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ఓటర్లు ఆసక్తి చూపారు. కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నా వెనకడుగు వేయకుండా పొలింగ్ కేంద్రాలకు(Polling Stations) తరలివచ్చి ఓటు వేశారు. యువకులు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చి ఓటు వేశారు. ఆరోగ్య సమస్యలున్నా ఓటు వేయాలనే సంకల్పంతో పక్కన మనిషి, చేతికర్ర సాయంతోపోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి క్యూలైన్‌లో ఉండి నచ్చిన అభ్యర్థికి ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు.
Senior Citizens Voting in Telangana :హైదరాబాద్ నారాయణగూడలో ఓటు వేసేందుకు వయోవృద్ధులు, దివ్యాంగులు ఆసక్తి చూపారు. తార్నాకలో 87 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేసి నచ్చిన అభ్యర్థిని ఎన్నుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన శేషయ్యకి 75 ఏళ్లు. తీవ్రమైన లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయినా ఓటు వేయాలనే పట్టుదలతో ఆక్సిజన్ సిలిండర్ సాయంతో గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌కి వచ్చి ఓటువేశాడు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతీఒక్కరూ నచ్చిన నాయకుల్ని ఎన్నుకోవాలని సూచించారు. జగిత్యాల గ్రామీణ మండలం పొలాసలో 105 ఏళ్ల రుక్కమ్మ.. అనే వృద్దురాలు ఓటువేసింది. ఆమెను వీల్ ఛైర్‌లో తీసుకు వచ్చి ఓటు వేయించారు. 105 ఏళ్ల వయస్సులో ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయటం ఆనందంగా ఉందని వృద్ధురాలు తెలిపింది.
ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి - బతికున్నంత వరకు ఓటేస్తానంటున్న శేషయ్య
Handicapped People Voting in Telangana :కరీంనగర్‌కి చెందిన అరుణ్ అనే దివ్యాంగుడు రెండు చేతులు లేకపోయినా.. పొలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటుహక్కు వినియోగించుకున్నాడు. చిన్నతనంలోనే విద్యుత్ షాక్‌గురై రెండు చేతులు పోగొట్టుకున్న అరుణ్.. 18 సంవత్సరాల క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్నారు ప్రొసీడింగ్ అధికారి కాలివేలికి చుక్కపెట్టి ఓటుహక్కు పత్రాలు అందించారు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కి జాకీర్‌పాషా పుట్టుకతోనే దివ్యాంగుడు. రెండు చేతులు లేకపోయినా అధైర్యపడకుండా ముందడుగు వేస్తున్నాడు. దైనందిన జీవితంలో సాధారణపనులన్నీ కాళ్లతోనే చేసుకుంటున్నాడు. ఎన్నికల్లో తనవంతు బాధ్యతగా పాల్గొని కాలితో ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.