Telangana Assembly Elections Expenditure 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం (Telangana Assembly Election Campaign) వేడెక్కింది. ఓ వైపు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో అభ్యర్థులు.. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినాయకుల వరకు అచితూచి అడుగులేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ కోసం కొందరు.. మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం అభ్యర్థులు ఖర్చు ఎంతైనా వెనకడుగు వేయడం లేదు.
MLA Candidates Spending Money in Election Campaign :ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లోని అన్ని వీధుల్లో.. ఓ రెండు ప్రధాన పార్టీలు బూత్‌స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఇందుకోసం ఒక్కో బూత్ పరిధి ప్రచారానికి ప్రతి రోజు రూ.5000 చొప్పున.. ఆ రెండు పార్టీలు కలిపి రూ.56,65,000 ఖర్చు చేస్తున్నాయి. వికారాబాద్, కొడంగల్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో మొత్తం 1,133 బూత్‌లు ఉన్నాయి. పార్టీల కార్యకర్తలు వీధుల్లో అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ప్రచారం చేయడానికి ముందు ఉదయం 10 గంటలకే నిర్ణీత ప్రదేశాలకు చేరుకుంటున్నారు.
Parties Campaign in Telangana Assembly Elections 2023 : అక్కడే టిఫిన్ చేసి టీలు తాగుతున్నారు. అనంతరం ప్రచారానికి బయల్దేరుతున్నారు. ఒంటి గంట వరకు తిరిగి ఉన్నచోటుకే చేరుకుంటున్నారు. ప్రచార నిర్వహణ చూస్తున్న నాయకులు.. కార్యకర్తల భోజనాలు, మద్యం కోసం నగదును ఖర్చు పెడుతున్నారు.వీలైతే కూలీ పనులు (Election Campaign in Telangana )మానేసి ప్రచారానికి వచ్చిన వారికి రోజూ కూలీ కూడా చెల్లిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై గత బుధవారం నాడు స్పష్టత వచ్చింది.