Telangana Assembly Elections Campaigns 2023 :రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తుండటంతో హస్తం నేతలు ప్రచారంలో జోష్ పెంచారు. ఆరు గ్యారంటీలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో విజయారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిర్మల్ అభ్యర్థి కుచాడి శ్రీహరి రావు ఈనెల 15న రేవంత్ రెడ్డి హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బోస్లే నారాయణ రావు చేతి గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ అభ్యర్థి వినయ్‌రెడ్డి సమక్షంలో 200మంది బీఆర్ఎస్, బీజేపీకు చెందిన యువకులు కాంగ్రెస్‌లోకి చేరారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో మైనంపల్లి రోహిత్‌రావు ఓట్లు అభ్యర్థించారు.
Congress In Election Campaign : ములుగు జిల్లాలో సీతక్క(Congress In Election Campaign) ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారంటీలను వివరించారు. పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి గడప, గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన జీవన్రెడ్డిబీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా ఆమనగల్లులోని శ్రీరామ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బంగారు లక్ష్మారెడ్డి ప్రచారం ప్రారంభించారు. మాడుగులపల్లి మండలంలో ఆంజనేయ స్వామి ఆలయంలో జైవీర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో బీర్ల ఐలయ్య ప్రచారానికి భారీ స్పందన వచ్చింది. ఖమ్మంలో తుమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి సీపీఐ, టీడీపీ శ్రేణులు హాజరయ్యాయి. మధిర నియోజకవర్గం బోనకల్‌లోని అంకమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి భట్టి విక్రమార్క ప్రచారం ఆరంభించారు. సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి ఆరు గ్యారంటీలను జనాలకు వివరించారు. ఖమ్మం రూరల్ మండలంలో ప్రచారం నిర్వహించిన పొంగులేటి ఇందిరమ్మ రాజ్యం కోసం హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.