Telangana Assembly Elections Campaigns 2023 : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్.. ప్రగతినగర్ నుంచి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్.. సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదేవిధంగా సనత్‌నగర్‌లో ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నీలిమ ఎన్నికల్లో గెలుపు ఖాయామని ధీమా వ్యక్తం చేశారు. గల్లీ.. గల్లీ తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి రంజిత్ కుమార్.. తమ ఇటుక గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థి దానం నాగేందర్ సోమాజిగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఆచితూచి అడుగేస్తున్న విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి
Telangana Assembly Elections 2023 : భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. వాకర్స్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య గడప గడపకు తిరిగి ఓటు అభ్యర్థించారు. నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని కొండాపురం, నేర్మట, ధోనిపాముల గ్రామాల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మిర్యాలగూడలోని షాపింగ్ మాల్స్‌లో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్‌కు మద్దతుగా జానారెడ్డి ప్రచారం చేయగా.. మహిళలు ఆటపాటలతో స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతా గెలుపు కోసం వారి కుమార్తె హర్షితారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ(bjp) అభ్యర్థి శ్రీదేవి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చెన్నూరులోని ఇందారం-1 గనిలో సింగరేణి కార్మికులను కలిసి ప్రచారం నిర్వహించారు.
తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారాలు - గెలుపు కోసం చెమటోడ్చుతోన్న అభ్యర్థులు