తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు అభ్యర్థుల వ్యూహం - ఓట్ల చీలికతో రాజకీయ పార్టీల కలవరం

Telangana Assembly Elections 2023 : ఒక్క ఓటు నేతల తలరాత, రాజకీయ భవిష్యత్త్​ను తారుమారు చేస్తుంది. జయాపజయాలను నిర్దేశిస్తుంది. నువ్వా-నేనా అనేంత పోటీ ఉన్న చోట ఓట్లను చేజారకుండా కాపాడుకోవటం అభ్యర్థులకు సవాలే అని చెప్పాలి. ప్రస్తుతం ఇంతటి క్లిష్ట వాతావరణం ఉన్న చోట ప్రధాన రాజకీయపార్టీలు గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులతో తెరవెనుక రాజకీయం నడిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు.. స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపి ఓట్లను చీల్చుతున్నారు.

Telangana Assembly Elections 2023
Political Parties Trick to Cross Voting

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 1:30 PM IST

Political Parties Trick to Cross Voting :ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. రాజకీయ పార్టీలు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఓట్ల కోసం బహిరంగ ప్రచారాలతో పాటు.. తెరవెనుక రాజకీయాలు నడిపిస్తారు. ఇందులో వారి మొదటి అస్త్రం ఓట్లను చీల్చడం. దీంతో లబ్ధిపొందాలని ప్రణాళికలు రచిస్తున్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో 5.7లక్షల ఓటర్లున్నారు . ఇక్కడ బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపును ప్రభావితం చేయగల మైనార్టీ ఓట్లు ఎంఐఎంకు చీలడంతో ఏ పార్టీకి మేలు జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల సిత్రం - మొన్నటి వరకు స్నేహితులు - కుర్చీ కొట్లాటలో ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థులు

Telangana Assembly Elections 2023 :జూబ్లీహిల్స్‌ స్థానం నుంచికాంగ్రెస్‌(Congress) టికెట్‌ ఆశించిన విష్ణువర్దన్‌రెడ్డి బీఆర్ఎస్​లోకి చేరారు. కాంగ్రెస్ తరఫున మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పోటీలో నిలిచారు. ఇక్కడ మైనార్టీల ఓట్లు లక్షకు పైగానే ఉంటాయని అంచనా. అయితే ఎంఐఎం సైతం తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. దీంతో ఇక్కడ చీలిక ఓట్లు ఏ అభ్యర్థికి గెలుపును తెచ్చిపెడతాయనేది ఆసక్తిగా మారింది.

కూకట్‌పల్లిలో సెటిలర్ల ఓటింగ్‌ కీలకం. 5లక్షల ఓటర్లున్న ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌, జనసేన బరిలో నిలిచాయి. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన బరిలోకి దిగింది. ఆయా పార్టీల్లో కొందరు కీలక నేతలు, అసంతృప్త నేతలు.. తమ సొంతపార్టీని వదలి వేర్వేరు పార్టీలకు మద్దతు పలుకుతున్నారు. బహిష్కృత నేతలను పార్టీల కీలక నేతలు బుజ్జగించినా కొందరు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగుతున్నారు. తాను కనీసం 10వేల ఓట్లు పొందుతానంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు.

సీఎంల నుంచి మంత్రుల వరకు - రాజకీయ నేతలకు అడ్డా @ బర్కత్‌పురా గడ్డ

Split Voting in Telangana : ఖైరతాబాద్‌ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి విజయారెడ్డి.. బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దానంతో పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. ఓ పార్టీ నుంచి టికెట్‌ దక్కని ఇద్దరు కీలక నేతలు తమ అభ్యర్థుల వెంట ప్రచారానికి వెళ్తూన్నారు. ఓటు మాత్రం మీకు నచ్చిన వారికి వేయమంటూ.. తమ అనుచరులు, అభిమానులకు సూచిస్తున్నారు. ఈ నేతలు కనీసం 25వేల మంది ఓటర్లను ప్రభావితం చేస్తారని అంచనా.

మీ వెనుక మేమున్నాం..ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తారు. ఓట్లను చీల్చడానికి.. నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కులం, మతాల ఆధారంగా స్వతంత్రులను బరిలోకి దింపుతారు. ఆయా సామాజిక వర్గాలు, తటస్థ ఓటర్ల ఓటు.. ప్రత్యర్థి పార్టీకి పడకుండా ఉండేలా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తారు. ప్రతిసారీ ఎన్నికల్లో నలుగురైదుగురు స్వతంత్ర అభ్యర్థులు.. ఇలా ప్రధానపార్టీలకు మేలు చేసేలా పోటీలో ఉండటం సర్వసాధారణంగా మారింది. అన్నిపార్టీల్లో అసెంబ్లీ టికెట్లు ఆశించి దక్కని కొందరు రెబెల్స్‌గా.. తమ ప్రభావం చూపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. తాము విజయం సాధించకున్నా.. ఓట్లు చీల్చి తమ వారినే ఓడించాలనే ధోరణితో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో నిలవాలనుకుంటున్నారు.

చిన్న పార్టీలు, స్వతంత్రులకు రోడ్డు రోలర్‌, చపాతీ కర్ర గుర్తుల కేటాయింపు - బీఆర్​ఎస్​ నేతల్లో గుబులు

ABOUT THE AUTHOR

...view details