Telangana Assembly Elections 2023 : బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఎన్నికల పోరులో హోరాహోరీగా తలపడుతుండగా... మిగతా పార్టీలు కూడా 'మేము సైతం' అంటూ ముందుకొస్తున్నాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బహుజన సమాజ్ పార్టీలో (BSP) చేరి.. ఆ పార్టీకి కొత్త ఊపు తెచ్చారు. బీఎస్పీ అధినేత్రి మయావతి... ఆర్ఎస్పీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బస్సుయాత్రతో జనంలోకి వెళ్లిన ఆయన... గ్రూప్-1, పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్య సహా బీఆర్ఎస్ (BRS) సర్కార్ విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నారు. 35 లక్షల మంది నిరుద్యోగ యువత పక్షాన నిలబడి పోరాటం చేసిన ఫలితంగా కొన్ని పరీక్షలు రద్దు చేసింది సర్కారు. తొలుత కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని భావించినా... ఆ అంచనాను తలకిందలు చేస్తూ.. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది.
BSP Candidates List : రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రెండు విడతల్లో 63 మంది అభ్యర్థుల్ని ప్రకటించి.. మూడో జాబితా కోసం కసరత్తు చేస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఎస్‌పీ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ చిత్రపు పుష్ఫిత లయ పేరు ఖరారు చేసి ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీ, ఎస్సీ-ఎస్టీ, మైనార్టీ ఓట్లపై బీఎస్పీ దృష్టి పెట్టింది. సిర్పూర్ కాగజ్ నియోజకవర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. తాను స్థానికేతరుడిని అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే కొనేరు కొనప్ప చేసిన విమర్శలకు స్పందించిన ప్రవీణ్... కాగజ్‌నగర్‌లో స్వంత ఇల్లు కొనుగోలు చేశారు. తాను పుట్టింది ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్లోనైనా... మరణించేది మాత్రం సిర్పూర్ గడ్డపైనేనని ప్రకటించిన ఆర్ఎస్పీ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు.
BSP Telangana Election Campaign 2023 : హైదరాబాద్ వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించిన బీఎస్పీ