తెలంగాణ

telangana

ETV Bharat / state

70 ఏళ్ల వయసులోనూ పదవి కోసం ఆరాటం - ప్రత్యర్థులతో సీనియర్ నాయకుల పోరాటం - ప్రత్యర్థులతో పోటీకి 70 ఏళ్ల సీనియర్ నాయకులు

Seniors Leaders competition in Assembly Elections : అసెంబ్లీ ఎన్నికల్లో మరొక్కసారి గెలవాలని.. ఏడు పదుల వయసులోనూ సీనియర్లు పోటీకి సిద్దం అయ్యారు. 70 ఏళ్ల వయసు దాటినా తాజా ఎన్నికల్లో ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతున్నారు. ఈసారి ఎన్నికలలో విజయం కీలకంగా భావిస్తున్నారు. మరి ఆ నేతలు ఎవరో..? వారి ప్రస్థానమేంటో తెలుసుకుందామా..?

telanagana assembly election
Seniors Leaders competition in Assembly Elections

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 5:30 PM IST

Seniors Leaders competition in Assembly Elections :ఎన్నికల పోటీకి వయసు ఆటంకం కాదని నిరూపిస్తూ పలువురు సీనియర్ నేతలు ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనేక ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపించి.. దశాబ్దాల రాజకీయ అనుభవంతో మరోసారి పోటీలోకి దిగుతున్నారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్య పదవులను నిర్వహించిన ఈ నేతలు.. 70 ఏళ్ల వయసు దాటినా తాజా ఎన్నికల్లో ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అంటూ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈసారి గెలవకపోతే మరో ఛాన్స్ ఉండదన్న భావనతో విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరొక్కసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి.. కురువృద్ధుల పోరులో ఉన్న ఈ నేతలు ఈ ఎన్నికల్లో వారు విజయ తీరాలకు చేరతారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నేతలు వీరే..

వనమా వెంకటేశ్వరరావు : ఈయన వయసు 79 ఏళ్లు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేశారు. కొత్తగూడెం బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మరోసారి బరిలో దిగారు. తన కొడుకు రాఘవ ఈసారి రాజకీయల్లో దిగుతాడని అందరూ భావించారు. కానీ ఓ కేసులో రాఘవ జైలుకి వెళ్లి వచ్చారు. దీంతో వనమా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి ఆయన పోటీపైన సందేహాలూ వ్యక్తమయ్యాయి. అయితే చివరకు బీఆర్ఎస్​ నుంచి టికెట్‌ దక్కించుకుని మరోసారి పోటీలో నిలిచారు.

  • పోచారం శ్రీనివాస్‌ రెడ్డి: వయసు 74 సంవత్సరాలు. బాన్సువాడ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు మంత్రిగా చేశారు. 2019 నుంచి స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వయసు ఎక్కువ కావడంతో ఈ ఎన్నికల్లో తప్పుకొని కుమారుడిని బరిలో దించాలనుకున్నారు. ఈ ప్రతిపాదనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అంగీకరించలేదు. ఈసారి కూడా మీరే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని కోరడంతో.. బాన్సువాడ నుంచి మరోసారి బరిలో దిగారు
  • ఇంద్రకరణ్‌రెడ్డి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాపరిషత్ ఛైర్మన్ గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అల్లోల ఇంధ్రకరణ్ రెడ్డి వయసు 74 సంవత్సరాలు. 2014లో బీఎస్పీ తరుపున పోటీ చేసి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఆవిర్భవించాక రెండుసార్లు మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం నిర్మల్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

సీఎం కేసీఆర్ మాటలతో కోటలు కడతారు తప్ప - మన సమస్యలు తీర్చరు : ఈటల రాజేందర్

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్‌ అగ్రనేతల రాక - ప్రచార కాక

  • మర్రి శశిధర్‌ రెడ్డి : సీఎంగా పనిచేసిన తన తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శశిధర్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. కొంతకాలం క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈసారి ఆయన కుమారుడు బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. కాని ఈసారి ఆయనే బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
  • రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి : రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి వయసు 71 సంవత్సరాలైనా సూర్యాపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి అయిదుసార్లు గెలుపొందారు. రెండుసార్లు మంత్రి అయ్యారు. తన కుమారుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. సూర్యాపేటలో టికెట్‌ కోసం ఈసారి పటేల్‌ రమేష్‌రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. కాని నామినేషన్ల గడువుకు ఒక్కరోజు ముందు దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కించుకున్నారు.

కాంగ్రెస్​కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటును అనుమతించినట్లే : హరీశ్​రావు

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాల జోరు - గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details