Telangana Assembly Election Temptations 2023:పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్ధులు తమకు పోలయ్యే ఓట్లపై దృష్టిసారించారు. డివిజన్ల వారీగా ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు తటస్థ ఓటర్ల వివరాలు రాబడుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకం కావటంతో గల్లీనాయకులు, చోటా నేతలు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కుల, మత, కాలనీ సంఘ నేతలతో.. మంతనాలు ప్రారంభించారు. తమ చేతిలో ఉన్న ఓట్లన్నీ గంపగుత్తుగావేయిస్తామంటూ హామీనిస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, అభ్యరుల మధ్య నెలకొన్న పోటీ ఆధారంగా ఓటుకు రేటు నిర్ణయిస్తున్నారు.
Money Distribution in Telangana Elections 2023:ప్రలోభాలపర్వం తారాస్థాయికి చేరుకుంది. స్థానిక నాయకులు, చోటామోట లీడర్లు.. ఇదే అదనుగా రంగంలోకి దిగారు. కులం, మతం, కాలనీ సంఘాల పేరిట బేరమాడుతున్నారు. అభ్యర్థుల నుంచి ఓటుకు 2000 నుంచి 5000 వరకు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మహేశ్వరం, చేవేళ్లలో ఓట్ల బేరాలు భారీఎత్తున సాగుతున్నట్టు సమాచారం.
ఓటర్లను ప్రలోభ పెట్టేవి తప్ప ఇతర సామాగ్రి సీజ్ చేయొద్దు : సీఈసీ
మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగారు. కూకట్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని సమాచారంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని వారి నుంచి 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. పార్టీలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.