Telangana Assembly Election Campaign 2023 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన 4 శాతం ముస్లిం రిజ్వేషన్లను తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అధికారికంగా విమోచన దినోత్సవంతో పాటు బీసీ ముఖ్యమంత్రి హామీ నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్ అంబర్‌పేట్ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి కృష్ణయాదవ్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి అమిత్‌షా రోడ్‌షో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్‌కు మద్దతుగా జరిగిన మేధావులు, నివాసితుల సంక్షేమ సంఘం సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. మోదీ హయాంలో దేశం సాధించిన ఘనతను ఆయన వివరించారు. కార్వాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అమర్‌సింగ్‌తో కలిసి రాజ్‌నాథ్‌సింగ్‌రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలను ఓడించాలని ఆయన కోరారు.
సామాన్యులతో ప్రియాంకా గాంధీ సందడి - హుస్నాబాద్‌లో ఆ కుటుంబానికి సర్ప్రైజ్
BJP Election Campaign in Telangana 2023 : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాయమాటలతో మోసం చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధిచెప్పాలని అర్వింద్ కోరారు. హనుమకొండలో పర్యటించిన బీజేపీ స్టార్ క్యాంపైనర్ కృష్ణ ప్రసాద్.. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కులేదన్న ఆయన.. తెలంగాణలో ఎలా అమలు చేస్తారన్నారు.
ఈటల రాజేందర్‌ను గెలిపించాలని కోరుతూ.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో ఆయన సతీమణి ఈటల జమున ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో బీజేపీ అభ్యర్థి భూక్యా సంగీత ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి దన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా నగరంలో ప్రచారం చేశారు.
Congress Election Campaign Telangana 2023 : నిజామాబాద్ జిల్లా పోతాంగల్‌లో బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చౌహాన్ ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాక అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ మద్దతుగా కోహిర్ మండలం చింతల్‌ఘాట్‌లో ఏఐసీసీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సుప్రియ శ్రీనేత్ ప్రచారం చేశారు.
బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్ షా
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇంటింటికి వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు. ఇటీవల పార్టీని వీడిన నర్సాపూర్ ఎంపీపీ దంపతులు రాజిరెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు.. హవేలీఘన్‌పూర్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి పర్యటనలో మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణల పట్ల కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతురావు ఎదురుదాడి చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.