Telangana Assembly Election Arrangements 2023 : ఎన్నికల వేళ ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు, నాయకులకు భద్రతను పెంచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు.. అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేరచరితులను గుర్తిస్తున్నారు.
Arrangements Of Telangana Assembly Elections 2023 :రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు వేళ పోలీసుల విస్తృత తనిఖీల్లో సీజ్ చేసిన మొత్తం రూ.400 కోట్ల రూపాయల మార్క్ దాటింది. అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల స్వాధీనాల మొత్తం రూ.412.46 కోట్లకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 60 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది.
Telangana Assembly Election Nominations 2023 :శుక్రవారం నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. అభ్యర్థుల వ్యయాన్ని నామినేషన్ దాఖలు సమయం నుంచి లెక్కిస్తారు. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు దృష్ట్యా రాష్ట్రానికి చెందిన యూనిఫాం సర్వీసుల సిబ్బందిని 65,000 మందిని వినియోగించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలు కూడా ఎన్నికల విధుల్లో ఉన్నాయి. ఇప్పటికే వంద కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయి.
Central Election Commission Telangana Tour Today :2018 ఎన్నికల సమయంలో రాష్ట్రానికి 300 కంపెనీల కేంద్ర బలగాలను పంపారు. ఇప్పుడు కూడా పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కేంద్ర బలగాలను ఈసీ తెలంగాణకు పంపుతోంది. ఎల్లుండి శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను సమీక్షించనుంది. ఇందులో భాగంగా సీఈసీ బృందం ఇవాళ హైదరాబాద్‌లో అధికారులతో సమావేశం కానున్నారు. ఓటర్ జాబితా, స్లిప్పుల పంపిణీ, ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాల ముద్రణా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై ఆరా తీయనున్నారు.