కరోనా వ్యాప్తి దృష్ట్యా.. సభ్యులంతా భౌతిక దూరం పాటించేలా శాసనసభ, శాసన పరిషత్‌లో సీటింగ్ ఏర్పాటు చేయిస్తున్నట్లు సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 13న అసెంబ్లీ, 14న కౌన్సిల్ సమావేశాలున్నందున.. ఏర్పాట్లను శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
కరోనా నిబంధనలతో.. శాసనసభ, మండలి సమావేశాలు - telangana council chairman sukhendar reddy
తెలంగాణ శాసనసభ, శాసన పరిషత్‌లో సభ్యుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయిస్తున్నామని సభాపతి పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు అసెంబ్లీ, బుధవారం రోజు కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.
శాసనసభ, మండలి సమావేశాలు
సభా ప్రాంగణాలను, సభ లోపలి ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేయించాలని కార్యదర్శిని ఆదేశించారు. సమావేశాల బందోబస్తుపై డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.