Telangana Annual Crime Report 2023 : హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల సీపీలు వార్షిక నేర నివేదికను ఇదివరకే విడుదలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రజల పర్యవేక్షణ కోసం మరింత శ్రమిస్తామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని చెప్పారు. ఒక శాతం రహదారి ప్రమాదాలు తగ్గాయని వివరించారు.
రాష్ట్రంలో 41 శాతం కోర్టు శిక్షలు, జీవిత ఖైదు 39 శాతం పెరిగాయని డీజీపీ చెప్పారు. నేరాలకు పాల్పడుతున్న 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 89,783 సైబర్ మోసాల ఫిర్యాదులు వచ్చాయని, ఇది దేశం మొత్తంలో 8వ శాతంగా ఉందని పేర్కొన్నారు.