తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో మొదలు.. - నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Meetings 2023: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి, రాష్ట్ర వార్షిక పద్దును ప్రణాళికను సోమవారం ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. బడ్జెట్‌ సమావేశాలు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.

Telangana Budget Meetings 2023
Telangana Budget Meetings 2023

By

Published : Feb 3, 2023, 6:49 AM IST

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో మొదలు..

Telangana Budget Meetings 2023: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులనుద్దేశించి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. నిరుడు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేదు. రెండేళ్ల తర్వాత గవర్నర్ తమిళిసై, ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

State Budget Meetings Will Start Today: పోలీసు సిబ్బంది ప్రత్యేక వాహన శ్రేణి ముందుకు కదులుతుండగా గవర్నర్ రాజ్‌భవన్ నుంచి శాసనసభకు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రసంగానికి తమిళిసై బుధవారం ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగంలో ఉండే అంశాలపై ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో ఏ ఏ అంశాలు ఉన్నాయోనన్న ఉత్కంఠ ఉంది. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి.

State Budget Meetings 2023: ఆ తర్వాత అసెంబ్లీ, కౌన్సిల్ సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశమవుతాయి. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా, చర్చించే అంశాలను సమావేశంలో ఖరారు చేస్తారు. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో రేపు చర్చ జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను ప్రభుత్వం సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.

శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వివిధ అంశాలు కూడా చర్చకు రానున్నాయి. రైతుల సమస్యలు, ఉద్యోగ నియామకాలు, ఆర్థిక పరిస్థితులు, శాంతి భద్రతలు, పోడు భూముల సమస్య, విద్యుత్, సాగునీటి అంశాలు, తదితరాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున కొన్ని తీర్మానాలు, బిల్లులను సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details